Ban on Basmati Rice | బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం.. షరతులు వర్తిస్తాయి.. ?!
Ban on Basmati Rice | అన్ని రకాల బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. తక్షణం అమల్లోకి వస్తాయని ఆదివారం జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించింది.
Ban on Basmati Rice | అన్నిరకాల బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నిషేధాజ్ఞలు తక్షణం అంటే 27.08.2023 నుంచి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్లో కేంద్రం వెల్లడించింది. టన్నుకు 1200 డాలర్లు (సుమారు రూ.99,058) కంటే తక్కువ ధర గల బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం అమలవుతుంది. ఈ నిషేధం తాత్కాలికమేనని కూడా కేంద్రం వెల్లడించింది.
ఉప్పుడు బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకం విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది కేంద్రం. వచ్చే అక్టోబర్ 16 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.
ఈ ఏడాది పలు రకాల బియ్యం ఎగుమతులపై నిషేధం, ఆంక్షలు విధించి కేంద్రం. గతేడాది 74 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం విదేశాలకు ఎగుమతి చేశారు. దేశీయంగా ఉప్పుడు బియ్యం ధర రికార్డు స్థాయికి పెరిగిపోవడంతో.. దేశీయంగా అవసరాలకు సరిపడా బియ్యం స్టాక్ నిర్వహణ కోసం ఎగుమతిపై నిషేధం విధించింది.
విదేశాలకు ఉప్పుడు బియ్యం ఎగుమతిపై కేంద్రం సుంకం విధించడంతో పాకిస్థాన్, థాయిలాండ్ దేశాల్లో బియ్యం ధరలు పెరిగాయి. విదేశీ వ్యాపారులు సైతం ఇతర దేశాల నుంచి చౌకగా బియ్యం దిగుమతి చేసుకునే ఆప్షన్ కూడా అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా 40 శాతానికి పై చిలుకే.
గత నెలలో బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. దేశీయంగా బియ్యం సరఫరా పెంపుదలకు, ధరల నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకున్నది. బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించడంతో ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు 12 ఏండ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

