టీజీ ఐపాస్‌తో వేగంగా అనుమతులిస్తాం
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కర్ణాటక పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం బెంగళూరులో నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ రోడ్‌షో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంలో కర్ణాటక అద్భుతంగా రాణిస్తున్నదని, తెలంగాణలో సైతం భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని కోరారు.
- తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి
- కర్ణాటక పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు పిలుపు
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కర్ణాటక పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం బెంగళూరులో నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ రోడ్‌షో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంలో కర్ణాటక అద్భుతంగా రాణిస్తున్నదని, తెలంగాణలో సైతం భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని కోరారు. రెండు రాష్ర్టాల మధ్య పారిశ్రామిక రంగంలో ఉన్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే బెంగళూరులో డిజైన్ చేసిన విమాన ఇంజిన్లు హైదరాబాద్ ఏరోస్పేస్ పార్కుల్లో తయారవుతాయని గుర్తు చేశారు. ఇక్కడి ఇంజినీర్లు డిజైన్ చేసిన చిప్‌లను తెలంగాణ తయారీ క్లస్టర్లలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో వినియోగిస్తారని వెల్లడించారు.
తెలంగాణ పత్తిని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుల్లో నూలుగా వడికిన తర్వాత బెంగళూరు ఉత్పాదకదారులు అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమల కోసం వినియోగిస్తున్నట్టు వివరించారు. కాగా, అంతర్జాతీయ కంపెనీలు తమ పరిశ్రమల ఏర్పాటుకు మొదట బెంగళూరునే ఎంచుకుంటున్నాయని మంత్రి చెప్పడం గమనార్హం. కానీ హైదరాబాద్‌లోనూ ఐఐఎస్సీ, ఐఐటీ హైదరాబాద్, ఐఎస్బీఈ, ఐఐఐటీల్లో ప్రతిభగల యువత ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక స్టార్టప్‌లకు టీ-హబ్ వేదికగా ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గడిచిన పన్నెండేండ్లలో హైదరాబాద్ ప్రపంచస్థాయి సాంకేతిక నగరంగా ఎదిగిందన్నారు. జీనోమ్ వ్యాలీ లైఫ్‌సైన్సెస్ పవర్ హౌస్‌గా రూపాంతరం చెందిందని గుర్తుచేశారు. టీజీ ఐపాస్‌తో వేగంగా పరిశ్రమలకు అనుమతులు లభిస్తాయని హామీ ఇచ్చారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పెట్టుబడులతో రావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి ఆహ్వానం పలికారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

