Tecno Phantom V Flip 5G | టెక్నో నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్ టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ.. ఇవీ డిటైల్స్..!
Tecno Phantom V Flip 5G | చుట్టూ కెమెరా సెటప్‌తో సర్క్యులర్ ఔట్ డిస్ ప్లేతో టెక్నో ఫాంటం రూపొందించిన రెండో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్.. టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ ఫోన్ శుక్రవారం ఆవిష్కరించారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.
Tecno Phantom V Flip 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో ఫాంటం (Tecno Phatom) భారత్ మార్కెట్లోకి శుక్రవారం ఫోల్డబుల్ ఫోన్ టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ (Tecno Phantom V Flip 5G) ఫోన్ ఆవిష్కరించింది. భారత్ మార్కెట్లోకి టెక్నో ఫాంటం తీసుకొచ్చిన రెండో ఫోల్డబుల్ ఫోన్ ఇది. ఈ ఏడాది ప్రారంభంలో బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2023లో ఆవిష్కరించిన టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ ఫోన్‌ను గత ఏప్రిల్‌లో దేశీయ మార్కెట్లోకి తెచ్చింది.
తాజాగా టెక్నో ఫాంటం (Tecno Phantom) ఆవిష్కరించిన టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ ఫోన్ (Tecno Phantom V Flip 5G) .. ఐకానిక్ బ్లాక్, మైస్టిక్ డాన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సింగిల్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తుంది. ఎర్లీ బర్డ్ ప్రైస్ రూ.49,999 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించారు. వచ్చేనెల ఒకటో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో లభిస్తుంది.
టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ (Tecno Phantom V Flip 5G) ఫోన్ ఫుల్ హెచ్డీ + (2400×1080 పిక్సెల్స్) ఫ్లెక్సిబుల్ అమోలెడ్ ఇన్నర్ డిస్ప్లే కలిగి ఉంటుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

క్లామ్‌షెల్ ఫోల్డబుల్ టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ (Tecno Phantom V Flip 5G) ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 8050 ఎస్వోసీ చిప్సెట్, ఆర్మ్ మాలీ-జీ 77 జీపీయూ విత్ 8జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ వర్చువల్లీ 16 జీబీ వరకూ, ఇంటర్నల్ స్టోరేజీ 256 జీబీ ఆఫ్ యూఎఫ్ఎస్ 3.1 ఇన్ బిల్ట్ స్టోరేజీ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13.5 వర్షన్ మీద పని చేస్తుందీ పోన్. రెండేండ్ల పాటు ఓఎస్ అప్ డేట్స్, మూడేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది.
టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ ఫోన్ 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, క్వాడ్ ఫ్లాష్ లైట్ యూనిట్‌తో 13-అంగుళాల మెగా పిక్సెల్ సెన్సర్ విత్ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా కలిగి ఉంటుంది. ఇక సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ సెన్సర్ కెమెరా కూడా ఉంటది.
5జీతోపాటు వై-ఫై 6, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ కలిగి ఉన్న టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ ఫోన్ ఎల్లా జీపీటీ 3.0కు మద్దతుగా ఉంటుంది. 45 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

