గ్లోబల్ స్థాయికి టీ హబ్ స్టార్టప్‌లు
అత్యుత్తమ ఆవిష్కరణల అడ్డాగా తెలంగాణ మారిపోతున్నది. దేశంలో స్టార్టప్ క్యాపిటల్‌గా వెలుగొందుతున్న రాష్ట్రం సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నది.
- టై గ్లోబల్ సమ్మిట్-100 ఎమర్జింగ్ స్టార్టప్‌ల జాబితాలో 13 ఎంపిక
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): అత్యుత్తమ ఆవిష్కరణల అడ్డాగా తెలంగాణ మారిపోతున్నది. దేశంలో స్టార్టప్ క్యాపిటల్‌గా వెలుగొందుతున్న రాష్ట్రం సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నది. అందుకు నిదర్శనం ఇటీవల ఎంతో ప్రతిష్ఠాత్మకమైన టై గ్లోబల్ సమ్మిట్-100 ఎమర్జింగ్ స్టార్టప్‌ల జాబితాలో టీ హబ్‌లోని 13 స్టార్టప్‌లకు చోటు దక్కడమే. అత్యుత్తమ ఆవిష్కరణలకు హద్దు.. సరిహద్దులు ఉండవు. ఇదే విషయాన్ని ఔత్సాహిక స్టార్టప్ వ్యవస్థాపకులకు తెలియజేసేలా టై గ్లోబల్ సమ్మిట్‌లో గ్లోబల్ ఎమర్జింగ్ స్టార్టప్‌ల ఎంపిక కోసం రేవాల్సిస్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు, సీఈవో రాజ్ సామల నేతృత్వంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎంపిక చేశారు. దీంట్లో ప్రపంచంలోని 14 దేశాల్లోని 80 నగరాల్లో నుంచి వెయ్యికి పైగా స్టార్టప్‌ల నుంచి దరఖాస్తులు రాగా..వాటిలో ఎమర్జింగ్ స్టార్టప్‌లుగా 68 స్టార్టప్‌లను ఎంపిక చేశారు. అందులో 76 శాతం స్టార్టప్‌లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి రావడం విశేషమని రాజ్ సామల తెలిపారు.
ఎంపిక చేసిన రంగాలు
ఎమర్జింగ్ స్టార్టప్‌ల జాబితాలో గుర్తింపు పొందిన స్టార్టప్‌లు పలు రంగాలకు చెందినవి కావడం విశేషం. కేవలం టెక్నాలజీ రంగం నుంచే కాకుండా ఆయా రంగాల్లో సేవలు అందిస్తున్న స్టార్టప్‌లు, వాటి ప్రతిభ ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. వీటిలో అగ్రిటెక్, రక్షణ, ఏరోస్పేస్, ఎడ్యుటెక్ , ఫిన్‌టెక్, ఇన్సూర్ టెక్, రెగ్‌టెక్, వెబ్ 3.0, గేమింగ్, మెటావర్స్, డిజిటలైజేషన్, హైపర్ లోకల్, ఈ-కామర్స్, హెల్త్ అండ్ లైఫ్ సైన్సెన్, ట్రావెల్, యానిమేషన్, మీడియా, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌లు ఉన్నాయి. ఐఎస్బీ- ఐ వెంచర్స్, స్టార్టప్ ఇండియా, నాస్కాం సహకారంతో వీటిని ఎంపిక చేశారు.
టీజీఎస్100 ఎమర్జింగ్ స్టార్టప్‌ల జాబితాలోని టీహబ్ స్టార్టప్‌లు..
- ఆక్వా ఎక్సేంజ్
- ఆత్రేయ ఇన్నోవేషన్స్
- ఏక్సియల్
- ఏరో కార్బనియో
- గ్రావిటన్
- మారుత్ డ్రోన్స్
- నీమోకేర్
- న్యూరల్ సింక్
- సెగ్రీ టెక్
- హెసావ్యోమిక్
- డ్రోన్స్
- విజిల్ డ్రైవ్
- నైరల్ నెట్వర్క్స్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

