Tata Neu | నియులో టాటాయేతర బ్రాండ్ ఉత్పత్తుల ఆర్డర్లు కూడా.. చంద్రశేఖరన్
Tata Neu | నియుతో ఇతర బ్రాండ్ల ఉత్పత్తులు, సర్వీసులను అందుకోవచ్చునని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు.
Tata Neu | ఇటీవలే టాటా గ్రూప్ ఆవిష్కరించిన సూపర్ యాప్ `టాటా నియూ`లో టాటా సన్స్ గ్రూప్యేతర బ్రాండ్ల వస్తువులు, సర్వీసులు కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సంగతి టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ గురువారం చెప్పారు. కొన్ని నెలలుగా ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత ఈ నెల ఏడో తేదీన అధికారికంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ సూపర్ యాప్ ద్వారా వాణిజ్య లావాదేవీలను ప్రారంభించడంలో ఎటువంటి జాప్యం ఉండబోదని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. `టాటా నియు` పాస్ నాన్ గ్రూప్ బ్రాండ్లకు కూడా అందుబాటులో ఉంటుందన్నారు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మాదిరిగానే గ్రాసరీ కొనుగోళ్ల నుంచి హోటల్, విమాన టికెట్ బుకింగ్ వరకు, మెడిసిన్స్ కొనుగోలుకు సింగిల్ ప్లాట్‌ఫామ్‌గా టాటా నియూ సూపర్ యాప్ పని చేయనున్నది. ఎయిర్ ఏషియా, బిగ్ బాస్కెట్, క్రోమా, ఐహెచ్‌సీఎల్, క్విమిన్, స్టార్‌బక్స్, టాటా 1ఎంజీ, టాటా క్లిక్, టాటా ప్లే, వెస్ట్ సైడ్ బ్రాండ్లను ఇప్పటికే సూపర్ యాప్‌లో చేరార్చారు. విస్తారా, ఎయిరిండియా, టైటాన్, తనిష్క్, టాటా మోటార్స్‌ను చేర్చనున్నారు.
గతేడాది మేలో ఆన్లైన్ గ్రాసరీ సెల్లర్ బిగ్‌బాస్కెట్‌లో టాటా డిజిటల్ మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. తద్వారా బిలియనీర్ ముకేశ్ అంబానీ రిలయన్స్ జియోమార్ట్, అమెజాన్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆ వెంటనే ఫిట్నెస్ ఫోకస్డ్ క్యూర్‌ఫిట్ హెల్త్‌కేర్‌లో 75 మిలియన్ల పెట్టుబడులు పెట్టింది. ఆన్లైన్ హెల్త్‌కేర్ మార్కెట్ ప్లేస్ సంస్థ 1ఎంజీలో మెజారిటీ వాటాను టాటా డిజిటల్ కైవశం చేసుకుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

