Tata Punch EV | దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఈ నెల 17న భారత్ మార్కెట్లోకి తన ఎలక్ట్రిక్ ఎస్యూవీ టాటా పంచ్ కారును తీసుకు రానున్నది. ఈ నెల ఐదో తేదీన టాటా పంచ్.ఈవీ కారును టాటా మోటార్స్ అధికారికంగా ఆవిష్కరించింది. బ్యాటరీ ప్యాక్ ఆధారంగా సింగిల్ చార్జింగ్‌తో 300-400 కి.మీ దూరం ప్రయాణిస్తుందీ కారు. టాటా పంచ్.ఈవీ కార్ల బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.
టాటా పంచ్.ఈవీ కారు కావాలంటే రూ.21 వేల టోకెన్ సొమ్ము చెల్లించి బుక్ చేసుకోవచ్చు. సిట్రోన్ సీ3 మోడల్ కారుతో టాటా పంచ్.ఈవీ పోటీ పడుతుంది. టాటా నెక్సాన్.ఈవీ, టాటా టియాగో.ఈవీ మధ్య టాటా పంచ్.ఈవీ ఉంటుంది. ఈ కారు ధర రూ.10 -13 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.
టాటా పంచ్.ఈవీ రెండు వేరియంట్లు – స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వేరియంట్లుగా ఆవిస్కరిస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ టాటా పంచ్.ఈవీ కారు 25 కిలోవాట్ల బ్యాటరీ, లాంగ్ రేంజ్ వేరియంట్ 35 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. స్టాండర్డ్ వేరియంట్ 3.3 కిలోవాట్ల ఏసీ చార్జర్ మాత్రమే కలిగి ఉండగా, లాంగ్ రేంజ్ వేరియంట్ 150కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జింగ్తోపాటు 7.2 కిలోవాట్ల ఏసీ చార్జర్ కూడా కలిగి ఉంటుంది.
టాటా పంచ్.ఈవీ స్టాండర్డ్ వేరియంట్ ఐదు ట్రిమ్స్‌ల్లో లభిస్తుంది. స్మార్ట్, స్మార్ట్ +, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+ వేరియంట్లుగా వస్తోంది. 5-డ్యుయల్ టోన్ కలర్ ఆప్షన్లు ఉంటాయి. ఇక లాంగ్ రేంజ్ టాటా పంచ్.ఈవీ మూడు ట్రిమ్స్ – అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ +, నాలుగు డ్యుయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
టాటా పంచ్.ఈవీ ఫ్రంట్‌లో ఫుల్ విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్ సెటప్, చార్జింగ్ సాకెట్, న్యూ డిజైన్డ్ బంపర్, వై-షేప్డ్ బ్రేక్ లైట్ సెటప్, రూఫ్ స్పాయిలర్, డ్యుయల్ టోన్ బంపర్ డిజైన్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ విత్ డిస్క్ బ్రేక్స్ ఫర్ ఫోర్ వీల్స్, స్టోరేజీ కోసం బాయ్ నెట్ కింద ట్రక్ ఏర్పాటు చేశారు.
టాటా పంచ్.ఈవీ న్యూ10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లార్జ్ స్పోక్ స్టీరింగ్ వీల్ ఫీచర్లు ఉంటాయి. స్టాండర్డ్ వేరియంట్ 7.0-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, ఉంటాయి. 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, కనెక్టెడ్ కార్ టెక్, వైర్ లెస్ చార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, క్రూయిజ్ కంట్రోల్, న్యూ ఆర్కేడ్.ఈవీ యాప్ సూట్, ఆప్షనల్‌గా సన్ రూఫ్ ఉంటాయి.
సేఫ్టీ కోసం అన్ని వేరియంట్లలో 6-ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈఎస్సీ, బ్లైండ్ వ్యూ మానిటర్, అన్ని సీట్లకు త్రీ పాయింట్ సీట్ బెల్టులు, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ మౌంట్, ఎస్‌వోఎస్ ఫంక్షన్ ఫీచర్లు ఉంటాయి. టాటా మోటార్స్ నుంచి వస్తున్న నాలుగో ఈవీ కారు ఇది. దేశంలోనే బుల్లి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు టాటా పంచ్ కానున్నది. జనరేషన్ 2 ఈవీ ఆర్కిటెక్చర్ టెక్నాలజీతో డెవలప్ చేసిన తొలి కారు ఇదే.