Tiago EV | రేపు టియాగో ఈవీ ఆవిష్కరణ.. మార్కెట్లో తొలి హ్యాచ్‌బ్యాక్ కారు ఇదేనా?!
Tiago EV | ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి టాటా మోటార్స్ తొలి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ వేరియంట్ టియాగో ఈవీని బుధవారం ఆవిష్కరించనున్నది.
Tiago EV | దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) విభాగంలో బుధవారం.. పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు టాటా టియాగో ఈవీని ఆవిష్కరించనున్నది. దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లోనూ ఇది తొలి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఈవీ కావడం గమనార్హం. ఇప్పటికే నెక్సాన్ ఈవీ, టైగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ మాక్స్, నెక్సాన్ ఈవీ ప్రైమ్ మోడల్ కార్లతో టాటా మోటార్స్ తన కంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ఏర్పాటు చేసుకున్నది. ప్రపంచ విద్యుత్ వాహనాల దినోత్సవం సందర్భంగా ఈ నెల ప్రారంభంలోనే త్వరలో టియాగో ఈవీని మార్కెట్లోకి తెస్తామని టాటా మోటార్స్ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర చెప్పారు.
నెక్సాన్ ఈవీ, టైగోర్ ఈవీ కార్లు వ్యక్తిగత సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. ఎక్స్‌ప్రెస్ టీ ఫ్లీట్ సెగ్మెంట్లోకి వస్తుంది. వచ్చే ఐదేండ్లలో ది ఎలక్ట్రిక్ మోడల్ కార్లను మార్కెట్లోకి తేవాలని టాటా మోటార్స్ లక్ష్యంగా పెట్టుకున్నది. దేశీయ ఈవీ మార్కెట్లో ప్రధాన వాటా టాటా మోటార్స్‌దే. భారత ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్‌లో దాదాపు 88 శాతం టాటా మోటార్స్‌దే. టాటా మోటార్స్ ఈవీ కార్ల సేల్స్‌లో నెక్సాన్ ఈవీకే అగ్ర తాంబూలం.
`ఈరోజు మాకు చిరస్మరణీయ సందర్భం. మార్కెట్లోకి టియాగో ఈవీ ఆవిష్కరణతో ఎలక్ట్రిక్ వెహికిల్స్ మార్కెట్లో మా పోర్ట్‌ఫోలియోను విస్తరించ తలపెట్టాం` అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేశ్ చంద్ర తెలిపారు. `ప్రారంభంలోనే ఈవీ మార్కెట్లోకి ఎంటరయ్యాం. నెక్సాన్ ఈవీ, టైగోర్ ఈవీతో మార్కెట్‌కు ఒక రూపు తీసుకొచ్చాం. ప్రస్తుతం రోడ్లపై 40 వేలకు పైగా టాటా మోటార్స్ ఈవీ కార్లు తిరుగుతున్నాయి` అని శైలేశ్ చంద్ర పేర్కొన్నారు.
టాటా మోటార్స్ ఈవీ సెగ్మెంట్లో టియాగో ఈవీ అత్యంత చౌక ధరకు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ధర రూ.10 లక్షల నుంచి మొదలవుతుందని తెలుస్తున్నది. ఇప్పటికైతే టియాగో ఈవీ మోడల్‌కు ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో ఇతర సంస్థల నుంచి పోటీ లేదు. కానీ టాటా మోటార్స్ టైగోర్ ఈవీతోనే పరోక్షంగా తల పడుతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

