హైదరాబాద్, నవంబర్ 24: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ క్లౌడ్ కమ్యూనికేషన్స్ కంపెనీ తాన్లా ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌కు అరుదైన గుర్తింపు లభించింది. గార్ట్నర్స్ 2021 కాంపిటీటివ్ ల్యాండ్‌స్కేప్ ఫర్ కమ్యూనికేషన్స్ ప్లాట్ఫామ్లో సర్వీస్ (సీపాస్)గా గుర్తింపు పొందినట్లు తాన్లా ప్లాట్‌ఫామ్స్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. సీపాస్ కాంపిటీటివ్ ల్యాండ్‌స్కేప్‌పై విడుదల చేసిన తాజా నివేదికలో ప్రపంచ సీపాస్ మార్కెట్‌ను సమీక్షించి 8 విక్రేతలను గార్ట్నర్ గుర్తించింది. ఇందులో తాన్లా కూడా ఉన్నది. పోర్ట్‌ఫోలియో డైవర్సిటీ, పరిమా ణం తదితర ప్ర మాణాల ఆధారం గా ఈ సమీక్షను గార్ట్నర్ నిర్వహించింది.