హైదరాబాద్, సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): టీహబ్ తాజాగా ప్రము ఖ ఐటీ కంపెనీ క్యాప్ జెమినితో జట్టు కట్టింది. టీహబ్‌లో ఆర్థిక సేవల రంగంలో సరికొత్త అప్లికేషన్లను రూపొందించే ఉద్దేశంలో భాగంగా ఇరువురి మధ్య మంగళవారం అధికారిక ఒప్పందం కుదిరింది.
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో కొత్తగా సాఫ్ట్వేర్ అప్లికేషన్లను రూపొందించేందుకు అవకాశాలపై వీరు ప్రధానంగా చర్చించనున్నారు. ప్రసుత్తం ఈ రంగంలోని పరిశ్రమల్లో ఉన్న పరిస్థితులను మార్చేందుకు సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేస్తుందని టీ హబ్ ప్రతినిధి పన్నీర్ సెల్వం మదన్ గోపాల్ తెలిపారు.