ఈ నెలలోనే కేంద్రానికి స్విస్‌లో రియల్టర్ల జాబితా?!
ఈ నెలలోనే కేంద్రానికి స్విస్‌లో రియల్టర్ల జాబితా | స్విస్‌లో రియల్ ఎస్టేట్ ఆస్తుల గల ఇండియన్లజాబితా ఈ నెలలో కేంద్రానికి అందనున్నది.

న్యూఢిల్లీ/ బెర్న్ : స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఖాతాలు గల భారతీయుల మూడో జాబితా ఈ నెలలో కేంద్ర ప్రభుత్వానికి అందనున్నది. రెండు దేశాల మధ్య పరస్పర సమాచార మార్పిడి ఒప్పందానికి అనుగుణంగా భారత్‌కు స్విట్జర్లాండ్ ఈ జాబితా అందజేస్తుంది. తొలిసారి స్విస్‌లో రియల్ ఎస్టేట్ ఆస్తులు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు, వాటిపై వచ్చే ఆదాయం వివరాల డేటా త్వరలో కేంద్రానికి అందుబాటులోకి రానున్నదని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో వీటిపై వచ్చే ఆదాయంపై పన్ను ఎగవేత అంశాలపై దృష్టి సారించేందుకు వీలు చిక్కుతుందని ఆ వర్గాల కథనం.
నల్లధనం నిల్వలను దాచుకునేందుకు స్విస్ బ్యాంకులు స్వర్గధామం అన్న గతంలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఫైనాన్సియల్ సెంటర్‌కు కీలకం అన్న విశ్వాసాన్ని తిరిగి పొందాలని స్విట్జర్లాండ్ భావిస్తున్నది. స్వచ్ఛంద సంస్థల సేవల సమాచారం, డిజిటల్ కరెన్సీల్లో పెట్టుబడుల వివరాలు భారత్‌కు అందుబాటులోకి రానున్నాయి. దీంతో విదేశాలకు నల్లధనం తరలింపునకు వ్యతిరేకంగా భారత్ సాగిస్తున్న పోరాటంలో ఇది కీలక మైలు రాయి కానున్నదని తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- indian realtors
- Indians
- swiss
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

