Swiggy Layoffs | స్విగ్గీలో మరోదఫా లేఆఫ్స్.. కారణమిదేనా..?!
Swiggy Layoffs | ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ మరో దఫా ఉద్యోగుల లే-ఆఫ్స్ కు సిద్ధమైందని సమాచారం. మొత్తం సిబ్బందిలో ఆరు శాతం మందిని ఇంటికి సాగనంపుతున్నట్లు తెలుస్తున్నది.
Swiggy Layoffs | కరోనా తర్వాత అధిక ధరలతో ద్రవ్యోల్బణం పైపైకి దూసుకెళ్లడంతో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం ఇంకా వీడలేదు. గ్లోబల్ కార్పొరేట్ సంస్థలు మొదలు స్టార్టప్‌ల వరకూ ప్రతి సంస్థ పొదుపు చర్యలు చేపడుతున్నది. ఆ జాబితాలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ కూడా చేరింది. తాజాగా మరోమారు ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైందని సమాచారం. తమ కంపెనీ నుంచి ఆరు శాతం సిబ్బందిని తొలగించేందుకు సిద్ధమైనట్లు స్విగ్గీ వర్గాల కథనం.
టెక్నాలజీతోపాటు కాల్ సెంటర్, కార్పొరేట్ రోల్స్ నిర్వహిస్తున్న సుమారు 350-400 మంది ఉద్యోగులకు లే-ఆఫ్స్ ప్రకటిస్తుందని స్విగ్గీ వర్గాలు చెప్పాయి. త్వరలో స్విగ్గీ దశల వారీగా ఈ ఉద్వాసనలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉద్యోగాల తొలగింపు విషయమై సీనియర్ ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఫుడ్ డెలివరీ బిజినెస్ లాభాల్లోనే కొనసాగుతున్నా.. ఇన్‌స్టా మార్ట్ ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
దీనికి తోడు త్వరలో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయ్యేందుకు స్విగ్గీ సన్నాహాలు చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఐపీఓకు వెళ్లడానికి ముందే ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా కంపెనీని లాభాల్లోకి తేవాలని స్విగ్గీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువులు తొలగించనున్నదని స్విగ్గీ వర్గాల కథనం. గతేడాది కూడా 360 మంది ఉద్యోగులకు స్విగ్గీ ఉద్వాసన పలికింది. గ్రోత్ తగ్గుముఖం పట్టడంతోపాటు అవసరాన్ని మించి నియమించుకున్న ఉద్యోగులను తొలగిస్తున్నామని స్విగ్గీ యాజమాన్యం చెబుతున్నట్లు సమాచారం. అయితే, ఉద్యోగుల ఉద్వాసనల విషయమై అధికారికంగా స్విగ్గీ యాజమాన్యం ధ్రువీకరించలేదని ఓ ఆంగ్ల దినపత్రిక ఒక వార్తా కథనం ప్రచురించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

