ముంబై: బలమైన విదేశీ మారకపు నిల్వలు (ఫారెక్స్) దేశానికి గ్లోబల్ షాక్స్‌ను అడ్డుకోలేవని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ‘బలమైన ఫారిన్ ఎక్సేంజ్ రిజర్వ్‌లతో గ్లోబల్ షాక్స్ నుంచి తప్పించుకోవచ్చని చెప్పనుగానీ వాటిని ధీటుగా ఎదుర్కొనే సత్తా వస్తుందని మాత్రం చెప్పగలను’ అన్నారు. క్రిసిల్ రేటింగ్స్ నిర్వహించిన వెబినార్‌లో దువ్వూరి మాట్లాడుతూ.. దేశంలో విదేశీ మారకపు నిల్వలు సమృద్ధిగా ఉన్న దగ్గర్నుంచే భారత్‌ను ఏ గ్లోబల్ షాక్ ఏమీ చేయలేకపోతున్నదన్న ఓ తప్పుడు అభిప్రాయం ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో 637.477 బి. డాలర్ల ఫారెక్స్ నిల్వలున్నాయి.