Sony Xperia 5 V | సోనీ నుంచి ప్రీమియం ఫోన్ సోనీ ఎక్స్‌పీరియా 5వీ.. ధరెంతో తెలుసా?!
Sony Xperia 5 V | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ సోనీ.. తన ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ ‘సోనీ ఎక్స్‌పీరియా 5వీ’ని మార్కెట్లో ఆవిష్కరించింది.
Sony Xperia 5 V | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ సోనీ తన ప్రీమియం క్యాటగిరీ స్మార్ట్ ఫోన్ సోనీ ఎక్స్‌పీరియా 5 వీ (Sony Xperia 5 V) ఫోన్ ఆవిష్కరించింది. సింగిల్ స్టోరేజీ వేరియంట్‌గా మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, డ్యుయల్ రేర్ కెమెరాసెటప్తో వస్తున్నది.
8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సోనీ ఎక్స్‌పీరియా 5వీ (Sony Xperia 5 V) ఫోన్ ధర సుమారు రూ.89,700 (999 యూరోలు) ఉంటుంది. బ్లాక్, బ్లూ, ప్లాటినం సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బ్రిటన్‌తోపాటు ఈయూ దేశాల్లో ఈ నెలాఖరులోగా విక్రయాలు ప్రారంభిస్తుంది. భారత్ లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు.
సోనీ ఎక్స్‌పీరియా 5వీ (Sony Xperia 5 V) ఫోన్ 6.1-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2520×1080 పిక్సెల్) ఓలెడ్ హెచ్డీఆర్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్‌పై పని చేస్తుంది.
సోనీ ఎక్స్‌పీరియా 5వీ (Sony Xperia 5 V) ఫోన్ 52- మెగా పిక్సెల్ ప్రైమరీ ఎక్స్మోర్ టీ సెన్సర్ కెమెరా, 12 – మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తోపాటు సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 12 – మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
పవర్ బ్యాకప్ కోసం 30వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో సోనీ ఎక్స్‌పీరియా 5వీ (Sony Xperia 5 V) ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇస్తారు. 5జీ, 4జీ వోల్ట్, వై-ఫై 6ఈ, బ్లూ టూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ 3.2 టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

