మరో ఏరోస్పేస్ ప్లాంట్
- రూ.250 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తున్న స్కంద
- వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 12 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ పెట్టుబడులకు నిలయంగా మారిన హైదరాబాద్ మహానగరం.. మరో ఘనతకు వేదికైంది. ఇక్కడి ఏరోస్పేస్ రంగానికి మరింత జోష్‌నిస్తూ హెలికాప్టర్ గేర్లు, గేర్‌బాక్సుల తయారీ కేంద్రం రానున్నది. రూ.250 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను స్కంద ఏరోస్పేస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఏటీపీఎల్) ఏర్పాటు చేస్తున్నది. రఘు వంశీ మెషీన్ టూల్స్, అమెరికాకు చెందిన రేవ్ గేర్స్ జాయింట్ వెంచరే ఈ ఎస్ఏటీపీఎల్. ఇందులో మెజారిటీ వాటా (55 శాతం) రేవ్ గేర్స్‌కు ఉండగా, మిగతా వాటా (45 శాతం) రఘు వంశీదే.
రేవ్ గేర్స్ దన్నుతో..
స్కంద ఏరోస్పేస్‌కు 9 మిలియన్ డాలర్లు సమకూరేలా వార్షిక ఆర్డర్లను అందిస్తామని ఈ సందర్భంగా రేవ్ గేర్స్ హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఉత్పాదక కేంద్రంతో వచ్చే 3-5 ఏండ్లలో వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా నడుస్తున్న రేవ్ గేర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లున్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్ ఇండస్ట్రీలకు డిజైనర్, మాన్యుఫ్యాక్చరర్, గేర్ల సిస్టమ్ ఇంటిగ్రేటర్‌గా సేవలందిస్తున్నది. బోయింగ్, రోల్స్ రాయిస్, బెల్, కొల్లిన్స్, బీఏఈ సిస్టమ్స్, మెక్లారెన్, నాస్కర్ తదితర సంస్థలు రేవ్ గేర్స్ కస్టమర్లే. ఇక రఘు వంశీ మెషీన్ టూల్స్ కూడా బోయింగ్, జీఈ ఏవియేషన్, ఈటన్, హనీవెల్ తదితర సంస్థలకు కీలక విడిభాగాల సరఫరాదారుగా ఉన్నది.
ఏరోస్పేస్ హబ్‌గా..
హైదరాబాద్ ఏరోస్పేస్ హబ్‌గా విరాజిల్లుతున్నది. ఆదిబట్ల ఏరోస్పేస్ పార్కులో అనేక కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులతో కొలువుదీరాయి. బోయింగ్ విమానాల విడిభాగాలు తయారుచేసే టాటా ఏరోస్పేస్, హెలికాప్టర్ విడిభాగాలు తయారుచేసే టాటా అడ్వాన్స్ సిస్టంలు ఇక్కడే ఉన్నాయి. టాటా సికోస్కీ ఏరోస్పేస్ లిమిటెడ్, టాటా లాక్‌హీడ్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్, వెమ్ టెక్నాలజీస్, ఎయిర్‌టెక్ ఇన్నోవేషన్, న్యూకాన్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, స్పేస్ ఎరా మెటీరియల్స్, ఎంకాన్ టెక్నాలజీస్.. ఇలా ఇరవైకిపైగా కంపెనీలు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటయ్యాయి. అంతే స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్నీ అందిస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

