Simple One EV Scooter | త్వరలో మార్కెట్లోకి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే..!
Simple One EV Scooter | భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం వేగంగా పెరగుతున్నది. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కస్టమర్ల అభిరుచి, ప్రాధాన్యానికి పెద్దపీట వేస్తూ కంపెనీలు కొత్త మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.
Simple One EV Scooter | భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం వేగంగా పెరగుతున్నది. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కస్టమర్ల అభిరుచి, ప్రాధాన్యానికి పెద్దపీట వేస్తూ కంపెనీలు కొత్త మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే కొత్త కంపెనీలు ద్విచక్ర వాహనాల మార్కెట్లోకి ప్రవేశించాయి. తాజాగా సింపుల్ వన్ ఎనర్జీ సైతం ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి ప్రవేశిస్తున్నది. కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల తేదీని ప్రకటించింది. అలాగే ధర, ఫీచర్స్‌ను సైతం వెల్లడించింది.

సింపుల్ వన్ తొలి స్కూటర్‌ను మే 23న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందరికీ అందుబాటు ధరల్లోనే ఉంటుందని, అంతర్జాతీయ స్థాయిలో కస్టమర్లకు ఉత్పత్తులను అందించడమే తమ లక్ష్యమని కంపెనీ సీఈవో సుహాస్ రాజ్‌కుమార్ పేర్కొన్నారు. కంపెనీ ఉత్పత్తులు ఉత్తమమైనవని నిర్ధారించుకునేందుకు డిమాండ్ ఉన్న పరిస్థితుల్లోనూ రెండేళ్లుగా పరీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (AIS) 156 Masato 3కి అనుగుణంగా.. బైక్‌లో ఉపయోగించే బ్యాటరీకి ఎక్కువ భద్రతను ఇస్తున్నట్లు తెలిపారు.

టెస్టింగ్ సమయంలో ఎదురైన అన్ని సమస్యలను విజయవంతంగా పరిష్కరించామన్నారు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూట్ కోసం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షకుపైగా బుకింగ్స్ జరిగాయని కంపెనీ పేర్కొంది. బైక్‌లో 4.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని, ఒకసారి ఛార్జ్ చేస్తూ ఏకధాటిగా 236 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని పేర్కొంది. అయితే, మార్చుకోదగిన బ్యాటరీ ప్యాక్‌తో కూడిన వేరియంట్ స్కూటర్‌పై గరిష్ఠంగా 300 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని కంపెనీ తెలిపింది.

స్కూటర్ సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 2.77 సెకన్లలో అందుకుంటుందని, గరిష్ఠంగా గంటకు 105 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చని చెప్పింది. స్కూటర్ బ్రాజెన్ బ్లాక్, నామా రెడ్, అజూర్ బ్లూ అండ్ గ్రేస్ వైట్ కలర్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. టచ్‌స్క్రీన్‌తో పాటు మ్యా్ప్స్, మ్యూజిక్, బ్లూటూత్, మొబైల్ కనెక్టివిటీ తదితర ఫీచర్స్ ఉన్నాయని తెలిపింది. అయితే, భారత మార్కెట్లో రూ.లక్ష నుంచి రూ.1.5లక్షల ధరకు విక్రయించనున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ బుకింగ్స్‌ను ప్రారంభించింది. కంపెనీ అధికారిక వెబ్సైట్లో రూ.1,947 చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని వివరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

