హైదరాబాద్, జూలై 27 : డిఫెన్స్ పరికరాల తయారీ సంస్థ సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. ఉత్తర అమెరికా నుంచి 104.9 మిలియన్ డాలర్లు లేదా రూ.1,013 కోట్ల విలువైన ఎగుమతి ఆర్డర్ లభించినట్టు కంపెనీ పేర్కొంది.
ఈ ఆర్డర్లో భాగంగా 1.47 లక్షల యూనిట్ట 155 ఎంఎం బేస్బ్లీడ్ ఆర్టిలరీ షెల్ బాడీలను వచ్చే ఆరు నుంచి ఏడాదికాలంలో తయారు చేసి విదేశాలకు సరఫరా చేయాల్సివుంటుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సుదూర శ్రేణి ఫిరంగి మందుగుండు సామగ్రికి పెరుగుతున్న డిమాండ్‌కు ఈ ఆర్డర్ నిదర్శనమని పేర్కొంది.