షాపింగ్ (క)మాల్!
షాపింగ్ మాల్స్‌తో నగర రూపురేఖలు మారిపోతున్నాయి. నగరవాసుల కొనుగోలు శక్తి పెరగడంతో వారు షాపింగ్, వినోదంపై అత్యధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. వీరి ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్స్ తమ కార్యాలయాలను నగరంలో ఏర్పాటు చేస్తున్నాయి.
- నగరవాసుల్లో పెరిగిన కొనుగోలు శక్తి
- శివార్లలోనూ వెలుస్తున్న బ్రాండెడ్ సంస్థలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): షాపింగ్ మాల్స్‌తో నగర రూపురేఖలు మారిపోతున్నాయి. నగరవాసుల కొనుగోలు శక్తి పెరగడంతో వారు షాపింగ్, వినోదంపై అత్యధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. వీరి ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్స్ తమ కార్యాలయాలను నగరంలో ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న షాపింగ్ మాల్స్‌కు ధీటుగా ఒకే చోట వినోదం, షాపింగ్ ఉండేలా మాల్స్ వెలుస్తున్నాయి.
కుటుంబ సమేతంగా అవసరమయ్యేవన్నీ అందుబాటులో ఉంచుతున్నాయి. చుట్టపక్కల రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ఇవి అంతగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే మాల్స్ నిర్మాణంలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. ఐటీ కారిడార్లోనే ఇవి అత్యధికంగా వస్తున్నాయి. రిటైల్ స్పేస్‌లో వ్యవస్థీకృత మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నది. బ్రాండెండ్ దుకాణాల రాకతో వీటికి డిమాండ్ పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వినోదం, షాపింగ్, ఆహారం వరకు అన్నీ ఒకేచోట సౌకర్యంగా ఉండటంతో సందర్శకులు ఉదయం నుంచి రాత్రి వరకు మాల్స్‌లోనే గడుపుతున్నారు. ఆదాయాలు పెరగడం, జీవనశైలిలో వచ్చిన మార్పులు కూడా వీటికి బాగా కలిసొస్తున్నది.
బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఐటీ కారిడార్, దిల్సుఖ్నగర్ పరిమితమైన మాల్స్ సంస్కృతి నగరంలోని శివార్లకు పాకింది. గచ్చిబౌలీలో అతిపెద్ద మాల్ శరత్ సిటీమాల్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో కొత్త మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. అత్తాపూర్‌లో కూడా వచ్చింది. వీటి రాకతో ఆ ప్రాంత రూపురేఖలు మాల్స్‌తో కళకళలాడుతున్నాయి. ఫలితంగా హైదరాబాద్ షాపింగ్ దుకాణాలు తమ బ్రాండ్లను నగరవాసులకు పరిచయం చేయడంలో పోటీపడుతున్నాయి. చాలా మంది ఇప్పుడు బ్రాండెడ్ దుస్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ధర అధికంగా ఉన్నప్పటికీ నాణ్యత దృష్టి లో పెట్టుకోవడం, ఇతరులకు భిన్నంగా కనిపించాలనే ఆసక్తి ఉం డటంతో బ్రాండెడ్ దుస్తులకు క్రేజ్ పెరుగుతున్నది. అందుకే వాటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని సంస్థలు విభిన్న రకాల డిజైన్లతో దుస్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

