ఫోర్బ్స్ 30-30లో హుజూర్నగర్ వాసి
హైదరాబాదీ స్టార్టప్ నెక్స్ వేవ్ వ్యవస్థాపకులు శశాంక్ రెడ్డి గుజ్జుల, అనుపమ్ పెదర్లకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇరువురు తెలుగువారికి ఈ ఏడాదికిగాను తాజాగా విడుదలైన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో చోటు లభించింది. కాగా, తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన శశాంక్ రెడ్డి గుజ్జుల, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాకు చెందిన అనుపమ్ పెదర్ల మరొకరితో కలిసి నెక్స్ వేవ్‌ను ఏర్పాటు చేశారు.
- శశాంక్ రెడ్డి గుజ్జులకు చోటు
- ఏలూరుకు చెందిన అనుపమ్ పెదర్లకూ స్థానం
- హైదరాబాదీ స్టార్టప్ నెక్స్ వేవ్ వ్యవస్థాపకులకు అరుదైన గౌరవం
హైదరాబాద్, ఫిబ్రవరి 15: హైదరాబాదీ స్టార్టప్ నెక్స్ వేవ్ వ్యవస్థాపకులు శశాంక్ రెడ్డి గుజ్జుల, అనుపమ్ పెదర్లకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇరువురు తెలుగువారికి ఈ ఏడాదికిగాను తాజాగా విడుదలైన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో చోటు లభించింది. కాగా, తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన శశాంక్ రెడ్డి గుజ్జుల, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాకు చెందిన అనుపమ్ పెదర్ల మరొకరితో కలిసి నెక్స్ వేవ్‌ను ఏర్పాటు చేశారు. ఇదో కొత్త తరం టెక్నాలజీ ఉద్యోగార్థుల ఆన్లైన్ ఎంప్లాయబిలిటీ ప్లాట్‌ఫామ్. ఈ వేదిక ద్వారా ఇప్పటిదాకా యువత పెద్ద ఎత్తునే సాఫ్ట్వేర్ ఉద్యోగాలను పొందడం విశేషం.
ఉద్యోగావకాశాలు వీడి..
ఐఐటీ బాంబేలో శశాంక్ కంప్యూటర్ సైన్స్ చదివారు. అనుపమ్.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ పూర్తిచేశారు. నిజానికి ప్రతిభకు తగ్గట్టుగా వీరిద్దరికీ బడా సంస్థల్లో ఎన్నో ఉద్యోగావకాశాలు వచ్చాయి. అయినప్పటికీ వాటన్నిటినీ కాదనుకుని యువతలో నైపుణ్యం, ప్రతిభను పెంపొందించి.. వారికి మెరుగైన ఉద్యోగాలు లభించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రాహుల్ అట్లూరితో కలిసి నెక్స్ వేవ్‌ను ప్రారంభించారు. అమెజాన్, గూగుల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి బహుళజాతి దిగ్గజాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లోనూ నెక్స్ వేవ్ ద్వారా వెళ్లినవారున్నారు. ఇలా విద్యా రంగంలో విశేష మార్పులు తీసుకువచ్చినందుకుగాను ఇప్పుడు ఫోర్బ్స్ జాబితాలో వీరిద్దరూ స్థానం సంపాదించారు.
మూడేండ్లలోనే..
దేశీయ విద్యా రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న స్టార్టప్‌ల్లో ఒకటిగా నెక్స్ వేవ్ కేవలం మూడేండ్లలోనే ఘనతను సాధించింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ నుంచి రూ.275 కోట్ల ఫండింగ్‌ను కూడా అందుకున్నది. ఇక రాబోయే రెండేండ్లలో దేశ, విదేశాల్లోని 10వేలకుపైగా కంపెనీలతో జతకట్టి అనేక ఉద్యోగావకాశాలను సృష్టించాలని నెక్స్ వేవ్ లక్ష్యంగా పెట్టుకున్నది.
ఇది మేము వ్యక్తిగతంగా సాధించిన గుర్తింపు కాదు. గొప్ప కలలు కని వాటి కోసం శ్రమిస్తున్న విద్యార్థులు, వారికి బోధిస్తున్న మా సిబ్బంది కృషికి ఈ గౌరవం దక్కుతుంది. మా సంస్థ మొదలు.. మా దృష్టి అంతా టెక్నాలజీ రంగంలో పెద్దపెద్ద అవకాశాలను అందిపుచ్చుకోవడంపైనే. ఫోర్బ్స్ గుర్తింపు మాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది.
-శశాంక్ రెడ్డి గుజ్జుల, నెక్స్ వేవ్ సహవ్యవస్థాపకుడు
యువతనే మన దేశ బలం. వారందరూ చక్కటి నైపుణ్యాలతో ఉంటే భారత్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుంది. ప్రపంచ శ్రేణి సాంకేతిక విద్యను దేశం నలుమూలలా తీసుకెళ్లడమే మా లక్ష్యం. విద్యార్థులకు సరైన రీతిలో చేయూతనందిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఫోర్బ్స్ గుర్తింపు వేలాది యువత జీవితాల్లో నెక్స్ వేవ్ తెస్తున్న మార్పునకు నిదర్శనం.
-అనుపమ్ పెదర్ల, నెక్స్ వేవ్ సహ వ్యవస్థాపకుడు, సీవోవో
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

