Apple Vs Huawei | చైనా మొబైల్‌ఫోన్స్ జెయింట్ హువావేపై న్యాయ పోరాటంలో గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ ఓటమి పాలైంది. హువావే తన ఇయర్‌బడ్స్ డివైజ్ పేరు మ్యాట్పాడ్ వాడకుండా నివారించాలని ఆపిల్ న్యాయ పోరాటానికి దిగింది.
తమ సంస్థ సొంత ట్రేడ్‌మార్క్స్ పాడ్, ఐపాడ్, ఇయర్ పాడ్స్ ఎయిర్‌పాడ్స్ మాదిరిగా హువావే మ్యాట్ పాడ్ వాడుతోందని ఆపిల్ అభియోగం. తమ ట్రేడ్‌మార్క్‌లను హువావే దురుద్దేశపూర్వకంగా వాడుతున్నదని ఆపిల్ ఆరోపించింది. దీనివల్ల సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
కానీ చైనా జాతీయ మేథో సంపత్తి సంస్థ (సీఎన్ఐపీఏ) మాత్రం ఆపిల్ సరైన ఆధారాలు చూపలేకపోయిందని అభిప్రాయ పడింది. ఆపిల్ చేసిన అభియోగాల్లో పసలేదని సీఎన్ఐపీఏ వ్యాఖ్యానించింది. మ్యాట్ పాడ్ ట్రేడ్ మార్క్ వాడేందుకు హువావేకు అనుమతి ఇచ్చింది. అయితే దీనిపై అదనపు అప్పీల్స్ దాఖలు చేయడానికి ఆపిల్‌కు హక్కు ఉంది.