Fixed Diposits | గత మే నుంచి వివిధ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీరేట్లు పెంచేశాయి. ఇటీవల ఆర్బీఐ 50 బేసిక్ పాయింట్లు పెంచడంతో రెపోరేట్ 5.90 శాతానికి చేరుకున్నది. బ్యాంకులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీరేట్లు పెరుగనున్నాయి. రిస్క్‌లకు దూరంగా ఉండే ఇన్వెస్టర్లకు ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా రిటర్న్స్ ఇచ్చే పథకాలు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు.
ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం ఏడు శాతం వద్ద ఉన్నది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు, రిటర్న్స్ మధ్య సమతుల్యత సాధించేలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉండాలి. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ స్థాయిలో కొన్ని బ్యాంక్‌లు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు వివిధ బ్యాంకులు ఖరారు చేశాయి.. ఆయా బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు ఎలా ఉన్నాయో చూద్దామా..!
బ్యాంకు పేరు ——————— మూడేండ్లకు వడ్డీరేటు
డీసీబీ బ్యాంక్ ——————— 7.60%
బంధన్ బ్యాంక్ ——————- 7.50%
ఇండస్ ఇండ్ బ్యాంక్ ————- 7.50%
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ — 7.40 %
డీసీబీ బ్యాంక్ ——————- 7.40%
బంధన్ బ్యాంక్ —————— 7.50%
ఇండస్ ఇండ్ బ్యాంక్ ————- 7.50%
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ — 7.40 %
ఆర్బీఎల్ బ్యాంక్ ————— 7.05%
సీనియర్ సిటిజన్లు, 60 ఏండ్లు దాటిన ఎస్బీఐ పెన్షనర్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనంగా 0.50 శాతం వడ్డీ రేటు అందజేస్తున్నది ఎస్బీఐ. ఎస్బీఐ రెసిడెంట్ ఇండియన్ సీనియర్ సిటిజన్ పెన్షనర్లు.. స్టాఫ్ పొందే ఒక శాతం, సీనియర్ సిటిజన్లు పొందే 0.50 శాతం వడ్డీ అందుకుంటారు. 60 ఏండ్ల నుంచి 80 ఏండ్ల వయస్సు గల సూపర్ సీనియర్ సిటిజన్ల ఐదేండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 50 బేసిక్ పాయింట్లు, ఐదేండ్లకు పైగా గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 80 బేసిక్ పాయింట్లు అదనంగా వడ్డీ అందిస్తున్నారు. ఎస్బీఐ రిటైర్డ్ స్టాఫ్ కం సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్ల (ఐదేండ్ల గడువు)పై 150 బేసిక్ పాయింట్లు, ఐదేండ్ల గడువు దాటిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 180 బేసిక్ పాయింట్ల వడ్డీ అదనంగా లభిస్తుంది. 80 ఏండ్లు దాటిన వారందరికీ అన్ని టెన్యూర్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 80 బేసిక్ పాయింట్లు అదనపు వడ్డీ లభిస్తుందని ఎస్బీఐ వెబ్సైట్ పేర్కొంది.
సీనియర్ సిటిజన్లకు ఏటా 50 వేల ఫిక్స్డ్ డిపాజిట్ల వరకు పన్ను రాయితీ ఉంటుంది. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్‌పై వచ్చే వడ్డీ ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది.