Fixed Diposits | అతి తక్కువ కాలంలో భారతీయ రిజర్వ్‌బ్యాంక్ (ఆర్బీఐ) 190బేసిక్ పాయింట్లు లేదా 1.9 శాతం రెపోరేట్ పెంచేసింది. తదనుగుణంగా ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీరేట్లు క్రమంగా పెంచేశాయి. కొద్ది నెలలుగా అత్యధిక బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు గణనీయంగా పెంచాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై గణనీయంగా వడ్డీరేట్లను పెంచడాన్ని పాసివ్ ఇన్‌కం మీద ఆధార పడిన సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లు స్వాగతిస్తున్నారని వేద్జైన్ అండ్ అసోసియేట్స్ పార్టనర్ అంకిత్ జైన్ చెప్పారు.
భారతీయులకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు అత్యంత పాపులర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లలో ఒకటి. ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే ఫిక్స్డ్ రిటర్న్స్ అందించడంతోపాటు అత్యధిక భద్రత గల పొదుపు పథకాలు కావడంతో ప్రజాదరణ పొందాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. ఫిక్స్డ్ డిపాజిట్లపై గత నెలలో 90 బేసిక్ పాయింట్ల మేరకు వడ్డీరేట్లు పెంచేసింది.
ఆకర్షణీయ వడ్డీరేట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి పలు బ్యాంకులు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను తీసుకొచ్చాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇన్వెస్టర్లు 7-7.25 శాతం వడ్డీరేట్లు పొందుతున్నారు. సీనియర్ సిటిజన్లు 7.5 నుంచి 7.75 శాతం వరకు వడ్డీరేట్లతో మంచి ఆదాయం పొందుతున్నారు. తరుచుగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచేశాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు సరిపోల్చుకుని ఇన్వెస్ట్ చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఫిక్స్డ్ డిపాజిట్లపై దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీరేట్లపై ఓ లుక్కేద్దాం..
బ్యాంకు —————————– ఏడాది —- రెండేండ్లు — మూడేండ్లు — ఐదేండ్లు — ఐదేండ్ల పై చిలుకు
బ్యాంక్ ఆఫ్ బరోడా —————- 4.65 ——– 5.5-5.75 ——– 5.55-6 ——– 5.65 ———— 5.65
బ్యాంకు ఆఫ్ ఇండియా ———- 4.6 ———– 5.75 – 6.3 ——- 5.75-7.25 ——- 6.25# ——– 5.75#
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ———— 5 ———— 5.4-5.7 ——— 5.5 —————- 5.5 ———- 5.5
కెనరాబ్యాంక్ ———————- 5.5 ———– 6.25-7 ———- 6.25 ————- 6.5 ———- 6.5
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా — 4.65-4.75 — 5.55-5.75 —— 5.6-6.25 ——— 5.5 ———- 5.6
ఇండియన్ బ్యాంక్ —————– 4.5-4.75 —— 6.1-6.3 ——– 6.5 ————- 6.4 ———– 6.4
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ——– 4.65 ——— 5.7-5.85 —– 5.7-6 ———- 5.85 ———— 5.85
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ————- 5.5 ———- 6.3-7 ——— 6.25 ———– 6.1 ———— 6.1
పంజాబ్ & సింధ్ బ్యాంక్ ———— 4.8-5.25 —— 5.8-6.10 —– 6.25-7 ——– 6.1 ———— 6.1
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా — 4.40-5.25 —- 6.3-7 ——- 6.7 ————- 6.7 ———- 6.7
యూకో బ్యాంక్ ———————— 4.4 ————- 5.3 ———– 5.3 ————– 5.6 ——— 5.3
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ———– 5.5 ———— 6.1 ———- 6.25 ———— 6.1 ———– 6.1
(2022 నవంబర్ 3న వివిధ బ్యాంకుల వెబ్సైట్ల ఆధారంగా తీసుకున్న డేటా ఇది)
ఆర్బీఐ రెపోరేట్ పెంపునకు అనుగుణంగా బ్యాంకులన్నీ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచలేదని నిపుణులు చెబుతున్నారు. మున్ముందు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెరుగుతాయంటున్నారు. బ్యాంక్ ఆఫ్ బజార్ డాట్ కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పంకజ్ బన్సాల్ ఈ సందర్భంగా స్పందిస్తూ ‘ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ద్రవ్యోల్బణం నియంత్రిత స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతున్నది. ధరల పెరుగుదలను కట్టడి చేయడానికి ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు ప్రక్రియ కొనసాగుతుంది. తదనుగుణంగా ఫిక్స్డ్ డిపాజిట్లపై పూర్తిగా వందశాతం వడ్డీరేట్లను పెంచకపోవచ్చు. కానీ, నగదు లభ్యత తగ్గింపు, కీలక వడ్డీరేట్ల పెంపుతో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు అధికం కావచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు 8-9 శాతానికి పెరుగొచ్చు’ అని అంచనా వేశారు.