హెల్త్‌కేర్‌కు ఎస్బీఐ కొత్త రుణ పథకం

న్యూఢిల్లీ, జూన్ 24: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ హెల్త్‌కేర్ సంస్థల కోసం ఒక కొత్త రుణ పథకాన్ని ప్రారంభించింది. ఆరోగ్యం హెల్త్‌కేర్ వ్యాపార రుణం పేరుతో మొదలైన ఈ స్కీము ద్వారా గరిష్ఠంగా రూ.100 కోట్ల వరకూ రుణం లభిస్తుందని ఎస్బీఐ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. హాస్పిటళ్లు, నర్సింగ్‌హోంలు, డయాగ్నస్టిక్ సెంటర్లు, పాథాలాజీ లాబ్‌లు, హెల్త్‌కేర్ పరికరాల తయారీదారులు, సరఫరాదారులు, దిగుమతిదారులు, రవాణా సంస్థలు ఈ రుణాన్ని పొందవచ్చు. రుణ చెల్లింపు కాలపరిమితి 10 సంవత్సరాలు. ఈ ఆరోగ్యం రుణాన్ని టెర్మ్రుణంగా లేదా వర్కింగ్ క్యాపిటల్ రుణ సదుపాయంగా పొందవచ్చని ఎస్బీఐ తెలిపింది. రూ. 2 కోట్ల వరకూ రుణం తీసుకునే సంస్థలు ఎటువంటి సెక్యూరిటీని బ్యాంకుకు సమర్పించనవసరం లేదని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా చెప్పారు.ఇటీవల రిజర్వుబ్యాంక్ కొవిడ్ లోన్‌బుక్ ద్వారా హెల్త్‌కేర్ రంగానికి రుణం ఇచ్చే అవకాశాన్ని బ్యాంకులకు కల్పించడంతో ఎస్బీఐ ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- healthcare sector
- rbi
- sbi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

