జీరో బ్యాలెన్స్ ఖాతాల నుంచి.. ఎస్బీఐ రూ.300 కోట్లు వసూలు

న్యూఢిల్లీ: జీరో బ్యాలెన్స్ ఖాతాల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గత ఐదేండ్లలో రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. ఐఐటీ బాంబే జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎస్బీఐతోపాటు పలు బ్యాంకులు ఖాతాలో డబ్బులు లేకపోయినా నిర్ణయించిన మేరకు కనీస నగదు లేకపోయినా ఖాతాదారుల నుంచి ఛార్జీలు వసూలు చేన్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 12 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాలు కలిగిన ఎస్బీఐ 2015-20 వరకు సర్వీస్ ఛార్జీల రూపంలో రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. 2018-19లో రూ.72 కోట్లు వసూలు చేయగా 2019-20లో గరిష్ఠంగా రూ.158 కోట్లు కలెక్ట్ చేసింది. దేశంలో రెండో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా 2015-20 వరకు 3.9 కోట్ల జీరో బ్యాలెన్స్ బీఎస్‌బీడీ ఖాతాల నుంచి రూ.9.9 కోట్లు చార్జీల కింద వసూలు చేసింది.
మరోవైపు ఆర్బీఐ నిబంధనలను ఎస్బీఐ క్రమబద్ధంగా ఉల్లంఘించిందని ఐఐటీ బాంబే ప్రొఫెసర్ ఆశిష్ దాస్ చేపట్టిన ఈ అధ్యయనం ఆరోపించింది. బీఎస్‌బీడీఏ ఖాతాలకు సంబంధించి నాలుగు దాటిన ప్రతి డెబిట్ లావాదేవీకి రూ. 17.70 చొప్పున వసూలు చేయాలని ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం సహేతుకం కాదని పేర్కొంది.
బీఎస్‌బీడీ ఖాతాలపై ఛార్జీలు వసూలు చేయడంపై 2013 సెప్టెంబర్‌లో ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం పేదలకు చెందిన బీఎస్‌బీడీ ఖాతాలకు నెలలో నాలుగు కంటే ఎక్కువ విత్ డ్రాలకు సంబంధిత బ్యాంకులు తమ అభీష్టం మేరకు అనుమతించవచ్చు.
అయితే ఎస్బీఐతోపాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఆర్బీఐ జారీ చేసిన ఈ నిబంధనను పక్కనపెట్టాయి. నాలుగు దాటిన ప్రతి డెబిట్ లావాదేవీపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలకు కూడా దీనిని వర్తింపజేస్తున్నాయని ఐఐటీ బాంబే నిర్వహించిన పరిశీలనలో తేలింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
Y.S. Jagan | వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు అత్యంత హేయం : వైఎస్ జగన్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Adilabad Rims Hospital | ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

