Credit Card Rules | క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్ ఇచ్చిన ఎస్బీఐ..! ఈ కార్డుల రివార్డు పాయింట్లలో భారీగా కోత..!
Credit Card Rules | ప్రస్తుతం కాలంలో క్రెడిట్‌కార్డులు భారీగా వాడుతున్నారు. బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థలు సైతం పెద్ద మొత్తంలో కార్డులను జారీ చేస్తున్నాయి. క్రెడిట్‌కార్డులతో ప్రయోజనాలు ఉండడంతో చాలామంది తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Credit Card Rules | ప్రస్తుతం కాలంలో క్రెడిట్‌కార్డులు భారీగా వాడుతున్నారు. బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థలు సైతం పెద్ద మొత్తంలో కార్డులను జారీ చేస్తున్నాయి. క్రెడిట్‌కార్డులతో ప్రయోజనాలు ఉండడంతో చాలామంది తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, బ్యాంకులు క్రికెట్కార్డులకు సంబంధించిన రూల్స్‌ను మారుస్తుంటూ వస్తుంటాయి. మారిన ఈ రూల్స్ త్వరలోనే అమలులోకి రానున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్‌కార్డుల యూజర్లకు షాక్ ఇచ్చింది. తాజాగా బ్యాంకు క్రెడిట్ కార్డు రూల్స్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన కార్డులపై రివార్డు పాయింట్లలో భారీగా కోత విధించింది.
స్విగ్గీ, ఎయిర్ ఇండియా టికెట్ల బుకింగ్‌లపై రికార్డుల్లో కోత విధించింది. ఎస్బీఐ సింప్లీక్లిక్ క్రెడిట్ కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం కార్డ్, ఎయిర్ ఇండియా సిగ్నేచర్ కార్డ్ హోల్డర్స్‌కు ఏప్రిల్ నుంచి రానున్న రివార్డుల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ జారీ చేస్తున్న ప్రముఖ క్రెడిట్ కార్డుల్లో సింప్లీ క్లిక్ కార్డ్ ఒకటి. ప్రస్తుతం ఈ కార్డ్ యూజర్స్ ఇప్పటి వరకు స్విగ్గీలో లావాదేవీలపై 10X రివార్డులు పొందుతూ వచ్చారు. ఇక ఏప్రిల్ నుంచి 5x మాత్రమే రివార్డు పాయింట్లు అందనున్నాయి. అయితే, అపోలో, బుక్ మైషో, క్లియర్ ట్రిప్, డామినోస్, మింత్రా, నెట్‌మెడ్స్, యాత్ర ప్లాట్‌ఫామ్స్ తదితర ఆన్లైన్ కొనుగోళ్లకు మాత్రం గతంలో మాదిరిగానే 10X రివార్డు పాయింట్స్ వస్తాయని చెప్పింది.
ఇక ఎయిర్ ఇండియా ప్లాటినం కార్డు హోల్డర్స్‌కు ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్స్‌పై ప్రతి రూ.100కి 15 రివార్డు పాయింట్లు వచ్చేవి. ఎయిర్ ఇండియా మొబైల్ యాప్, వెబ్సైట్ ద్వారా కొనుగోళ్లకు రివార్డ్స్ వర్తంచేవవి. తాజాగా ఏప్రిల్ నుంచి కేవలం 5 రివార్డు పాయింట్లు మాత్రమే రానున్నాయి. ఎయిర్ ఇండియా సిగ్నేచర్ క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు ప్రస్తుతం ఎయిర్ ఇండియా టికెట్‌ను బుక్ చేస్తు ప్రతి రూ.100కు 30 రివార్డు పాయింట్లు ఇస్తుంది. నెలాఖరు నుంచి రూ.100కి కేవలం పది రివార్డు పాయింట్లు మాత్రమే ఇవ్వనున్నది. రూల్స్‌కు మార్పు గురించి ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

