ఎస్బీఐ యోనోలో కొత్త ఫీచర్
ముంబై, ఏప్రిల్ 23: పొదుపు ఖాతా తెరవాలనుకునే వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ‘యోనో’ మొబైల్ యాప్‌లో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వీడియో కేవైసీ (నో యువర్ కస్టమర్)ని ఆధారంగా చేసుకుని సులభంగా సేవింగ్స్ అకౌంట్ తెరిచేందుకు ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుని కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో కాగితరహితంగా పొదుపు ఖాతా తెరుచుకోవచ్చని ఎస్బీఐ వివరించింది.