నెలకు 10 అవుట్లెట్లు
- రెండేండ్లలో 200 స్టోర్లు ప్రారంభిస్తాం
- సంగీత మొబైల్స్ ఎండీ సుభాష్ చంద్ర వెల్లడి
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ బిజినెస్ ప్రతినిధి): దేశంలో అతిపెద్ద మొబైల్ విక్రయ సంస్థ సంగీతా మొబైల్స్ 48వ వార్షికోత్సవ ఉత్సవాలను జరుపుకుంటుంది. సంస్థను ఆరంభించి 48 ఏండ్లు అవుతున్న సందర్భంగా ప్రకటించిన పలు ఆఫర్లు ఈ నెల చివరి వరకు అమలులో ఉండనున్నాయి. ఈ సందర్భంగా సంగీతా మొబైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ..మొబైల్ కొనుగోలుదారులకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఈసారి పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించినట్లు, ముఖ్యంగా ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినవారికి స్మార్ట్‌వాచ్ ఒక స్మార్ట్‌ఫోన్ కొంటే మరో ఫీచర్ ఫోన్‌ను ఉచితంగాను అందిస్తున్నట్లు ప్రకటించారు. కరోనాతో వ్యాపార విస్తరణకు బ్రేక్ పడిందని, ఈ ఏడాది నుంచి ప్రతి నెలలో 10 అవుట్లెట్ల చొప్పున వచ్చే రెండేండ్లలో 200కి పైగా స్టోర్లను ఆరంభించాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 800కి పైగా స్టోర్లు ఉండగా, వచ్చే రెండేండ్లలో ఈ సంఖ్య వెయ్యికి చేరుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.
3 వేల కోట్ల ఆదాయం లక్ష్యం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.3 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. గతేడాది ఇది రూ.2,200 కోట్లుగా నమోదైంది. కరోనాతో గత రెండేండ్లుగా ఆశించిన స్థాయిలో వ్యాపారం సాగకపోయినప్పటికీ ఉద్యోగులను తొలగించలేదని, ముఖ్యంగా ఒక్క రిటైల్ అవుట్లెట్నూ మూసివేయలేదని ఆయన ప్రకటించారు.
రెండేండ్ల తర్వాత ఐపీవోకి..
రెండేండ్ల తర్వాత ఐపీవోకి వచ్చే అవకాశాలున్నాయని సుభాష్ చంద్ర పేర్కొన్నారు. రెండేండ్ల క్రితం రావాలనుకున్నప్పటికీ కరోనాతో వాయిదా పడిందని చెప్పారు. ఈ ఐపీవో ద్వారా గరిష్ఠంగా రూ.500 కోట్ల వరకు నిధులు సేకరించాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రైవేట్ ఈక్విటీల నుంచి ఇలా నిధులు సేకరించడం ఇదే తొలిసారికానున్నదని వ్యాఖ్యానించారు.
తెలుగు రాష్ర్టాల్లో 300 స్టోర్లు..
తెలుగు రాష్ర్టాల్లో దాదాపు 300 స్టోర్లు ఉన్నాయి. వీటిలో తెలంగాణలో 165, ఏపీల్లో మిగతా 135 ఉన్నాయి. ఒక్కో స్టోర్‌లో 5-10 ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటారు. ఇప్పటి వరకు రిటైల్ అవుట్లెట్లలో 6 వేల మంది విధులు నిర్వహిస్తుండగా, వీరిలో కంపెనీ తరపున 3 వేల మంది ఉండగా, మిగతా 3 వేల మంది ఆయా సంస్థలకు చెందిన వారని ఆయన పేర్కొన్నారు. చిప్‌ల కొరత, కరోనాతో గత రెండేండ్లుగా సరాసరిగా 13 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసుకున్నామని, ఈ సారి 40 శాతం వృద్ధిని అంచనావేస్తున్నామన్నారు.
48వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన పలు ఆఫర్లు
- రూ.10 వేల కంటే అధిక విలువైన స్మార్ట్‌ఫోన్‌తో రూ.5 వేల విలువైన స్మార్ట్ వాచ్ ఉచితంగా అందిస్తున్నది.
- మార్పిడి చేసే పాత ఫోన్లపై ఇతర సంస్థల కంటే 20 శాతం అధికంగా చెల్లించనున్నది.
- ఏ ఫోన్ కొన్నా సంవత్సరం వరకు నీటిలో పడేసిన, పగల కొట్టుకున్న కొత్త ఫోన్ ఇస్తుంది. సగం డబ్బు సంస్థ చెల్లించనున్నది..మిగతా డబ్బు కస్టమర్ చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం ఫీజు కింద కస్టమర్ రూ.99 చెల్లించాల్సి ఉంటుంది.
- రూ.5 వేల విలువైన 4జీ ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.1,400 విలువ కలిగిన ఫీచర్ ఫోన్ ఉచితంగా అందిస్తున్నది.
- ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో రూ.3,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభించనున్నది. వీటితోపాటు బజాజ్ ఫైనాన్స్, ఇతర కార్డులపై కూడా రూ.3 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను ఇస్తున్నది.
- వార్షికోత్సవం అయిన తర్వాత సంస్థ నిర్వహిస్తున్న లక్కీ డ్రాలో 30 ఈవీలు గెలుచుకునే అవకాశం ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

