Samsung Galaxy S22 | శాంసంగ్ గెలాక్సీ ఎస్22పై భారీ డిస్కౌంట్.. బేస్ వేరియంట్ ఓన్లీ..!
Samsung Galaxy S22 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్.. తన ప్రీమియం ఫోన్ గెలాక్సీ ఎస్22 ఫోన్ ధర భారత్‌లో భారీగా తగ్గించింది. ఇప్పుడు రూ.54,999లకే సొంతం చేసుకోవచ్చు.
Samsung Galaxy S22 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్22 (Samsung Galaxy S22)పై భారీగా ధర తగ్గించింది. గతేడాది ఫిబ్రవరిలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రెండు వేరియంట్లు- 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉన్నది.
బేస్ మోడల్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ లాంచింగ్ ధర రూ.72,999గా నిర్ణయించింది. తదుపరి దీనిపై వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే రూ.8000 ధర తగ్గించేసింది. దీంతో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 (Samsung Galaxy S22) ఫోన్ రూ.64,999లకు దిగి వచ్చింది. భారత్‌లో స్మార్ట్ ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకునే వారికి శాంసంగ్ ఇండియా మరో రూ.7000 డిస్కౌంట్ ప్రకటించింది.పలు బ్యాంకు క్రెడిట్ కార్డులపై నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
అంటే శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఫోన్ రూ.57,999లకు లభిస్తుంది. సెలెక్టెడ్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.3000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీంతో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 (Samsung Galaxy S22) ఫోన్ రూ.54,999లకే సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ ఇండియా వెబ్సైట్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్, దేశంలోని సెలెక్టెడ్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
ఇవీ స్పెషిపికేషన్స్
శాంసంగ్ గెలాక్సీ ఎస్22 (Samsung Galaxy S22) ఫోన్ 6.1-అంగుళాల ఫుల్ హెచ్డీ + డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే విత్ 120 హెర్ట్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నది. గొరిల్లా గ్లాస్ విక్టస్ + ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. డ్యుయల్ నానో సిమ్-సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12-బేస్డ్ వన్ యూఐ 4.1 వర్షన్ మీద పని చేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ((Samsung Galaxy S22).. 4ఎన్ఎం ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ఎస్వోసీ చిప్సెట్, 50-మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేజేషన్ (ఓఐఎస్), 12-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్డ్రావైడ్ సెన్సర్, 10-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఏ టెలిఫొటో లెన్స్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ((Samsung Galaxy S22) ఫోన్ 3700 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ విత్ 25 వాట్ల వైర్డ్, 15 వాట్ల వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూ టూత్ వీ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌పై ఐపీ68 రేటింగ్, సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

