Samsung Galaxy A14 4G | త్వరలో భారత్ మార్కెట్లోకి శాంసంగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..
Samsung Galaxy A14 4G | శాంసంగ్.. త్వరలో భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ గెలాక్సీ ఏ14 4జీ ఫోన్ తీసుకు రానున్నది.
Samsung Galaxy A14 4G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్.. త్వరలో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్.. ‘ఏ’ సిరీస్ ఫోన్ భారత్ మార్కెట్లోకి తీసుకు రానున్నది. ఈ ఏడాది ప్రారంభంలో మలేషియాలో విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఏ14 4జీ (Samsung Galaxy A14 4G) ఫోన్ వచ్చే వారం భారతీయులకు అందుబాటులోకి రానున్నది. ఈ ఫోన్ 6.6 -అంగుళాల (1,080×2,408 పిక్సెల్) పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తున్నది. ఈ ఫోన్ మీడియా టెక్ హెలియో జీ80 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ14 4జీ (Samsung Galaxy A14 4G) ఫోన్.. రెండు స్టోరేజీ వేరియంట్లలో వస్తుందని తెలుస్తున్నది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 4జీబీ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో రావచ్చు. ఈ ఫోన్ బేస్ మోడల్ ధర రూ.13,999, 4జీబీ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ మోడల్ రూ.14,999లకు లభిస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్ బేస్డ్ వన్ యూఐ 5.0 వర్షన్ మీద పని చేస్తుందని తెలుస్తు్న్నది.
గెలాక్సీ ఏ14 4జీ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరాలతో రానున్నది. ఫ్రంట్ లో 13-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 15 వాట్ల చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

