రూపాయి మరింత పతనం.. డాలర్‌తో పోలిస్తే 83.06 వద్ద ట్రేడింగ్
rupee depreciation: రూపాయి విలువ ఇవాళ మరింత పతనమైంది. ఇవాళ ట్రేడింగ్ సమయంలో 6 పైసలు తగ్గి .. డాలర్‌తో పోలిస్తే 83.06 వద్ద ట్రేడ్ అయ్యింది. స్టాక్ ఎక్స్చేంజ్ వద్ద ఇవాళ డాలర్‌తో పోలిస్తే 83.05 వద్ద ట్రేడింగ్ మొదలైం
ముంబై: రూపాయి విలువ ఇవాళ మరింత పతనమైంది. ఇవాళ ట్రేడింగ్ సమయంలో 6 పైసలు తగ్గి .. డాలర్‌తో పోలిస్తే 83.06 వద్ద ట్రేడ్ అయ్యింది. స్టాక్ ఎక్స్చేంజ్ వద్ద ఇవాళ డాలర్‌తో పోలిస్తే 83.05 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఆ తర్వాత మరింత దిగజారి.. 83.06కు చేరుకున్నది. గత క్లోజింగ్ మార్కెట్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆరు పైసలు తగ్గింది.
బుధవారం కూడా ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కష్టానికి చేరుకున్నది. బుధవారం రూపాయి విలువ 60 పైసలు తగ్గింది. దాంతో డాలర్ విలువ 83 వద్ద నిలిచిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో రుపీ అల్లాడిపోయింది
పలు ప్రపంచ ప్రధాన కరెన్సీల కంటే భారత కరెన్సీ అత్యధికంగా పతనం కావడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటివరకు 11.75 శాతం దేశీయ కరెన్సీ విలువ జారుకున్నది. 2013 తర్వాత ఒకే ఏడాదిలో ఇంత నష్టపోవడం ఇదే తొలిసారి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

