Future Gets Relief | ఫ్యూచర్‌కు రిలీఫ్.. మరో 6 నెలలు గడువు
Future Gets Relief | రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ విలీనానికి 2022 మార్చి నెలాఖరు వరకు గడువు లభించింది.

అమెజాన్‌తో న్యాయ పోరాటం నేపథ్యంలో రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ విలీనానికి మరో ఆరు నెలల గడువు.. అంటే వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు లభించింది. రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్‌లో తమ సంస్థ విలీనానికి 2021 సెప్టెంబర్ 30 నుంచి 2022 మార్చి 31 వరకు గడువు లభించిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఫ్యూచర్ రిటైల్ శుక్రవారం తెలిపింది.
రిలయన్స్ రిటైల్ వెంచర్లో ఫ్యూచర్ గ్రూప్ విలీనానికి గతేడాది రూ.24,713 కోట్ల విలువైన ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ రిటైల్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు బిగ్ బజార్, నీల్గిరీస్, ఎఫ్‌బీబీ, ఈజీడే, సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీ విలీనం అవుతాయి.
దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులోనూ, సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టులోనూ గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కేసులు వేసింది. 2019 ఆగస్టులో ఫ్యూచర్ అనుబంధ ఫ్యూచర్ కూపన్స్‌లో అమెజాన్ 49 శాతం (ఫ్యూచర్ రిటైల్‌లో 7.3 శాతం వాటా) వాటా కొనుగోలు చేసింది. దీని ప్రకారం మూడేండ్ల నుంచి 10 ఏండ్లలో ఫ్యూచర్ రిటైల్‌ను పూర్తిగా టేకోవర్ చేసే హక్కు అమెజాన్‌కు దఖలు పడింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Amazon
- future retail
- reliance
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

