న్యూఢిల్లీ, జూన్ 16: అమెరికా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డెబిట్/క్రెడిట్ కార్డుల నెట్వర్కింగ్ సంస్థ మాస్టర్ కార్డ్‌పై నియంత్రణల్ని తొలగిస్తున్నట్టు రిజర్వ్‌బ్యాంక్ గురువారం తెలిపింది. లోకల్ డాటా స్టోరేజ్ నిబంధనల్ని పాటించడం లేదన్న ఆరోపణలపై కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా గత ఏడాది మాస్టర్ కార్డ్‌పై ఆర్బీఐ నిషేధం విధించింది. పేమెంట్ సిస్టమ్ డాటా నిబంధనల పాటింపుపై సంతృప్తిచెందినందున మాస్టర్‌కార్డ్ ఆసియా/పసిఫిక్‌పై నియంత్రణల్ని ఎత్తివేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.