Redmi K60 Ultra | రెడ్మీ నుంచి మరో ప్రీమియం ఫోన్.. రెడ్మీ కే60 ఆల్ట్రా.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Redmi K60 Ultra | షియోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ తన కే సిరీస్‌లో రెడ్మీ కే60 ఆల్ట్రా ఫోన్ తెచ్చింది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, మీడియా టెక్ డైమెన్సిటీ 9200 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటది.
Redmi K60 Ultra | షియోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ మరో ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. కే సిరీస్‌లో ఫోన్ రెడ్మీ కే60 ఆల్ట్రా (Redmi K60 Ultra) ఫోన్ తీసుకొచ్చింది. షియోమీ ఫోల్డ్3 ఫోన్‌తోపాటు షియోమీ పాడ్ 6 మ్యాక్స్, షియోమీ బాండ్ 8 ప్రో లతో కలిపి రెడ్మీ కే60 ఆల్ట్రా ఫోన్ ఆవిష్కరించింది. చైనాలో పూర్తిగా ఆఫ్ లైన్లో ఈ ఉత్పత్తులు ఆవిష్కరించారు. భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారో వెల్లడించలేదు.
రెడ్మీ కే60 ఆల్ట్రా (Redmi K60 Ultra) ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే స్క్రీన్, మీడియా టెక్ డైమెన్సిటీ 9200+ ఎస్వోసీ ప్రాసెసర్, కపుల్డ్ విత్ మీడియాటెక్ 690 ఏపీయూతో కలిసి వస్తుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. బ్లాక్, వైట్, గ్రీన్ షేడ్ కలర్స్‌లో లభిస్తుంది.
12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.30 వేలు (2599 చైనా యువాన్లు), 16 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.32 వేలు (2799 చైనా యువాన్లు), 16 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ దాదాపుగా రూ.34,350 (2999 చైనా యువాన్లు) పలుకుతుంది. 16 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.38 వేలు (3299 చైనా యువాన్లు), హై ఎండ్ మోడల్ 24 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.41,200 (3599 చైనా యువాన్లు) పలుకుతుంది.
రెడ్మీ కే60 ఆల్ట్రా ఫోన్ (Redmi K60 Ultra) 6.67-అంగుళాల (2272×1220 పిక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్ విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 9200 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటది. వైల్డ్ బూస్ట్ 2.0 టెక్నాలజీతో వస్తున్న ఈ ఫోన్ మూడు డిగ్రీల సెల్సియస్ వద్ద కూల్ అవుతుంది.
రెడ్మీ కే60 ఆల్ట్రా (Redmi K60 Ultra) ఫోన్.. 50-మెగా పిక్సెల్స్ ఐఎంఎక్స్800 సోనీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ లెన్స్, 2-మెగా పిక్సెల్ పొర్ట్రైట్ కెమెరా తోకూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. ఈ ఫోన్ 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
Hunter Road | సౌకర్యవంతమైన సేవల కోసం హంటర్ రోడ్డులో కొత్త బస్ స్టాప్
సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

