Redmi | రెడ్మీ నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు ఏ2.. ఏ2+ ఫోన్లపై రెండేండ్ల వారంటీ.. ఇవీ స్పెషిఫికేషన్స్!
Redmi | షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ.. భారత్ మార్కెట్లోకి ఏ2, ఏ2+ పేరిట రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు తెచ్చింది. వీటిపై రెండేండ్ల వారంటీ కూడా అందిస్తున్నది.
Redmi | చైనా టెక్నాలజీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ.. భారత్ మార్కెట్లోకి `ఏ2` సిరీస్ ఫోన్లను శుక్రవారం ఆవిష్కరించింది. అత్యంత చౌక ధరకే రెడ్మీ ఏ2 (Redmi A2), రెడ్మీ ఏ2+ (Redmi A2+) వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్ప్లేతో పలు కలర్ ఆప్షన్లలో వస్తున్నాయి. రెండు మోడల్ ఫోన్లలోనూ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ చిప్ సెట్‌తో పని చేస్తాయి. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తున్నాయి. రెడ్మీ ఏ2 సిరీస్ ఫోన్లు 6.52-అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 8-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ ఉంటుంది. రెడ్మీ ఏ2 + (Redmi A2+) ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌తో వస్తున్నది. రెడ్మీ ఏ2 (Redmi A2), రెడ్మీ ఏ2+ (Redmi A2+) ఫోన్ల విక్రయాలు ఈ నెల 23 నుంచి భారత్‌లో ప్రారంభం అవుతాయి.
స్టోరేజీ.. కలర్ ఆప్షన్లు ఇలా
రెడ్మీ ఏ2 (Redmi A2) ఫోన్ బేస్ 2జీబీ రామ్ విత్ 32 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.5,999, 2జీబీ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.6,499, 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.7,499లకు లభిస్తుంది. రెడ్మీ ఏ2+ (Redmi A2+) 4జీబీ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.8,499లకు అందుబాటులో ఉంటుంది. రెడ్మీ ఏ2 సిరీస్ ఫోన్లన్నీ బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ షేడ్ కలర్స్‌లో లభిస్తాయి.
అమెజాన్, ఎంఐ డాట్కాం, ఎంఐ హోం స్టోర్లు, షియోమీ రిటైల్ పార్టనర్ షోరూమ్‌ల్లో ఈ నెల 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్లు లభిస్తాయి. ఐసీఐసీఐ క్రెడిట్/ డెబిట్ కార్డుతో రెడ్మీ ఏ2 సిరీస్ ఫోన్లు కొనుగోలు చేసిన వారికి రూ.500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. రెండేండ్ల వారంటీ కూడా అందిస్తున్నది.
ఇవీ స్పెషిఫికేషన్స్..
రెడ్మీ ఏ2 (Redmi A2), రెడ్మీ ఏ2+ (Redmi A2+) ఫోన్లు డ్యుయల్ సిమ్ ఆప్షన్ కలిగి ఉంటాయి. ఆండ్రాయిడ్ 12 వర్షన్‌పై పని చేస్తాయి. 6.52-అంగుళాల హెచ్డీ + (1600 x 720 పిక్సెల్స్ రిజొల్యూషన్) ఎల్సీడీ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటాయి. సెల్ఫీల కోసం స్క్రీన్‌పై వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ చిప్సెట్ కలిగి ఉంటాయి.
రెడ్మీ ఏ2, రెడ్మీ ఏ2+ ఫోన్లు రెండూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) -బ్యాక్డ్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నాయి. 8-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, క్యూవీజీఏ కెమెరా ఉంటాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 5-మెగా పిక్సెల్ కెమెరా సెన్సర్ ఉంటుంది. రెండు ఫోన్లూ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటాయి. మైక్రో ఎస్డీ కార్డుతో 512 జీబీ వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు.
వై-ఫై, బ్లూ టూత్, ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్ ఉంటుంది. రెడ్ మీ ఏ2+ ఫోన్ బయోమెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంటుంది. రెడ్మీ ఏ2 సిరీస్ ఫోన్లలో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ విత్ 10 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వయా బండిల్డ్ చార్జర్‌తో వస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో స్టాండ్‌బై మోడ్‌లో బ్యాటరీ 32 రోజులు, ప్లే టైం 150 గంటలు సపోర్ట్‌గా ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- Redmi
- xioami
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

