కోలుకుంటున్న రియల్ ఎస్టేట్

- పెరుగుతున్న అమ్మకాలు
- ఆగస్టులో జోరందుకుంటాయన్న అంచనాలు
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పట్టాలెక్కుతున్నది. కరోనా సెకండ్ వేవ్ మధ్య లాక్డౌన్ సమయంలో కొనుగోళ్లు, అమ్మకాలు స్తంభించినా.. ఆంక్షలు ఎత్తివేయగానే క్రయవిక్రయాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. మొదటి వేవ్‌తో పోల్చితే ఈసారి పెద్దగా నష్టం జరుగలేదన్నది మార్కెట్ వర్గాల మాట. సాధారణంగా ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తల్లిదండ్రులు తమ సేవింగ్స్‌ను పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తుంటారు. దీంతో ఈ మూడు నెలలపాటు ఇండ్లు, ప్లాట్ల కొనుగోళ్లు కాస్త మందగిస్తుంటాయి. జూలై చివరి వారం లేదా ఆగస్ట్ మొదటివారం నుంచి మళ్లీ కొనుగోళ్ల వేగం పెరుగుతుంది. ఈసారి కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇండిపెండెంట్ హౌజ్‌లకు గిరాకీ
కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల ఆలోచనా విధానం కూడా మారింది. ఇంతకుముందు అపార్ట్మెంట్లలో అయితే అందరితో కలిసి ఉండవచ్చనే భావన ఉండేది. ఇప్పుడు వ్యక్తిగత ఇండ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదటివేవ్ తర్వాతి నుంచి ఇప్పటివరకు చూస్తే ఇండిపెండెంట్ హౌజ్‌లు, విల్లాల అమ్మకం 10-20 శాతం పెరిగినట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు.. అవసరమైతే నగరానికి, కాలుష్యానికి దూరంగా, పచ్చని ప్రకృతి మధ్య జీవించాలని చాలా మంది భావిస్తున్నారు. దీంతో ఔటర్లో మార్కెట్ క్రమంగా పెరుగుతున్నది.
కలిసొచ్చిన ప్రభుత్వ పాలసీలు
కరోనా మొదటి వేవ్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తిరిగి పుంజుకోవడానికి, సెకండ్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వ పాలసీలు బాగా కలిసొచ్చాయి. ఐటీతోపాటు తయారీ, ఔషధ రంగాలను ప్రోత్సహిస్తుండటంతో తెలంగాణలో తప్పక ఉపాధి దొరుకుతుందన్న భావన అందరిలో నెలకొన్నది. ఇది నిర్మాణ రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నది.
భూములపై పెరిగిన పెట్టుబడి
కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం పెరిగింది. రైతుబంధు, ధాన్యం విక్రయాల ద్వారా రైతు చేతికి డబ్బు వస్తున్నది. దీంతో భూములపై పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నారు. కాగా, పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ చర్యల ఫలితంగా రాబోయే 2-3 ఏండ్లలో ఉద్యోగాల కల్పన విపరీతంగా పెరుగనున్నది. ఫార్మాసిటి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ రియల్టీ మరో స్థాయికి వెళ్లనున్నది.
‘రియల్ ఎస్టేట్ రంగాన్ని సెకండ్ వేవ్ ఇబ్బంది పెట్టినా.. మొదటి వేవ్ స్థాయిలో దెబ్బతీయలేదు. లాక్డౌన్ తర్వాత పరిస్థితులు వేగంగా చక్కబడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ వినూత్న పాలసీల ఫలితంగా పెట్టుబడిదారుల్లో రాష్ట్రంపై ఏమాత్రం ఆసక్తి తగ్గలేదు. దీంతో పెట్టుబడులు కొనసాగుతున్నాయి’
రాజశేఖర్ రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

