RBI | రూ. 2000 నోట్ల డిపాజిట్‌కు రేపటితో ముగియనున్న డెడ్‌లైన్ : ఇంకా చలామణిలో రూ. 12,000 కోట్ల విలువైన నోట్లు
రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు రేపటితో గడువు ముగుస్తుండటంతో ఆర్బీఐ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు.
న్యూఢిల్లీ : రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు రేపటితో గడువు ముగుస్తుండటంతో ఆర్బీఐ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రూ. 12,000 కోట్ల విలువైన (3.37 శాతం) 2000 నోట్లు చలామణిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రూ. 2000 నోట్లలో 96 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్ధకు వచ్చాయని చెప్పారు.
ఇప్పటివరకూ రూ. 3.43 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు బ్యాంకులకు చేరాయని కేవలం రూ. 12,000 కోట్ల విలువైన నోట్లు మిగిలిఉన్నాయని శక్తికాంత దాస్ తెలిపారు. 87 శాతం బ్యాంక్ డిపాజిట్లుగా వచ్చాయని, మిగిలినవి ఇతర నోట్లతో ఎక్స్ఛేంజ్ చేసుకున్నారని ఆయన వెల్లడించారు.
రూ. 2000 నోటును ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ మే 19న వెల్లడించే నాటికి రూ. 3.56 లక్షల కోట్లు వ్యవస్ధలో ఉండగా, ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకూ రూ. 3.44 లక్షల కోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్ధలోకి తిరిగివచ్చాయని చెప్పారు. ఇక అక్టోబర్ 8 నుంచి బ్యాంకులు రూ. 2000 నోట్లను ఖాతాల్లో జమచేయడం, లేదా ఇతర బ్యాంక్ నోట్లతో ఎక్స్ఛేంజ్ను నిలిపివేస్తాయని ఆర్బీఐ పేర్కొంది.
Read More :Putin: ఉక్రెయిన్ 90 వేల మంది సైనికుల్ని కోల్పయింది: పుతిన్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

