ముంబై, నవంబర్ 30: మూడు బ్యాంకులపై రిజర్వు బ్యాంక్ కన్నెర్ర చేసింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్.ఏ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లపై రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది.
రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాలను పట్టించుకోకపోవడంతో బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్.ఏపై, అలాగే నాన్-రెసిడెంట్స్ డిపాజిట్ల విషయంలో మార్గదర్శకాలు తిలోదకాలు ఇవ్వడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌పై ఫైన్ విధించింది. వీటితోపాటు పలు కో-ఆపరేటివ్ బ్యాంక్‌లపై జరిమానాలను వేసింది.