Tata Sons New Chairman? | టాటా నూతన సారధిపై బోర్డుదే తుది నిర్ణయం.. రతన్ టాటా
Tata Sons New Chairman? | టాటా సన్స్ నూతన సారధిపై ఏ చర్చ, సంప్రదింపులు, ప్రతిపాదనల్లేవని రతన్ టాటా, చంద్రశేఖరన్ తేల్చేశారు.

Tata Sons New Chairman? | టాటా సన్స్ సారధి నటరాజన్ చంద్రశేఖరన్ (58) వారసుడి ఎంపికకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయన్న ప్రచారం జరుగుతున్నది. చంద్రశేఖరన్ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనున్నది. మరోమారు ఆయననే టాటా సన్స్ చైర్మన్‌గా కొనసాగించడానికి సంప్రదింపులు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. దీనిపై టాటా సన్స్ గౌరవ చైర్మన్, టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా స్పందించారు.

‘దీనిపై నన్నెవరూ సంప్రదించలేదు. మీడియాలో వచ్చిన కథనంలో వాస్తవం లేదు. అదీ కాగా చంద్రశేఖరన్‌నే రెండోసారి కొనసాగించాలన్న ప్రతిపాదనేదీ నా దృష్టికి రాలేదు. దీనిపై టాటా సన్స్ బోర్డ్, వాటాదారులు సరైన నిర్ణయం తీసుకుంటారనే భావిస్తున్నా’ అని రతన్ టాటా పేర్కొన్నారు.

టాటా సన్స్ చైర్మన్ నియామకంపై రతన్ టాటా గానీ, టాటా సన్స్ బోర్డు గానీ, టాటా ట్రస్ట్గానీ నిర్ణయం తీసుకోలేదని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని తెలిపారు. ఈ విషయమై టాటా సన్స్ బోర్డు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానని ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, చంద్రశేఖరన్ పనితీరు ఆధారంగా రెండోసారి కూడా ఆయననే కొనసాగించడానికి టాటా సన్స్ బోర్డు ప్రయత్నాలు చేస్తున్నదని ఓ జాతీయ పత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

