PVR & INOX Merger | ఒక్కటైన పీవీఆర్.. ఐనాక్స్ లీజర్.. ఇక మల్టీప్లెక్స్‌లో ఆధిపత్యమేనా!
PVR & INOX Merger | దేశీయ మల్టీప్లెక్స్ థియేటర్ల రంగంలో పోటీ పడుతున్న పీవీఆర్, ఐనాక్స్ లీజర్ విలీనం అవుతున్నట్లు ప్రకటించాయి.
PVR & INOX Merger | మల్టీపెక్స్ సినిమా థియేటర్ల రంగంలో పోటీ పడుతున్న పీవీఆర్, ఐనాక్స్ లీజర్ ఒక్కటి కానున్నాయి. వీటి విలీనానికి రెండు సంస్థల బోర్డులు ఆదివాంర ఆమోదం తెలిపాయి. పీవీఆర్‌లో ఐనాక్స్ విలీనం కానున్నది. ఈ విలీనానికి రెండు సంస్థల వాటాదారులతోపాటు స్టాక్ ఎక్స్చేంజ్లు, స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తదితర నియంత్రణ సంస్థల ఆమోదం లభించాల్సి ఉంటుంది.
రెండు సంస్థల విలీనంతో ఏర్పాటైన సంస్థకు అజయ్ బిజ్లీ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. సంజీవ్‌కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, సిద్ధార్థ్ జైన్ నాన్ ఎగ్జిక్యూటివ్-నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. రెండు సంస్థల విలీనం తర్వాత ఏర్పాటయ్యే మల్టీప్లెక్స్ సంస్థ బోర్డును పునర్వ్యవస్థీకరిస్తారు.
విలీన బోర్డులో మొత్తం 10 మంది డైరెక్టర్లు ఉంటారు. రెండు సంస్థల ప్రమోటర్లకు సమాన సంఖ్యలో డైరెక్టర్లు నియమితులవుతారు. విలీనం తర్వాత పీవీఆర్ ప్రమోటర్లకు 10.62 శాతం, ఐనాక్స్ ప్రమోటర్లు 16.66 శాతం వాటా కలిగి ఉంటారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- INOX
- merger
- Multiflex Theaters
- pvr
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

