Post Office Savings | పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్.. డిపాజిటర్ మృతి చెందితే.. క్లయిమ్ దాఖలు ఇలా
Post Office Savings | పోస్టాఫీసు సేవింగ్స్ పథకాల్లో డిపాజిటర్లు మరణిస్తే, సంబంధిత వ్యక్తుల చట్టబద్ధ వారసులు డెత్ క్లయిమ్స్ సమర్పించడానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. క్లయిమ్ రూ.5 లక్షలు దాటితే కోర్టు నుంచి క్లయిమ్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి.
Post Office Savings | దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, మారుమూల పల్లెల వరకు విస్తరించిన నెట్వర్క్ పోస్టాఫీస్. కేవలం ప్రజలకు ఉత్తర ప్రత్యుత్తరాలు, మనీ ఆర్డర్లు, స్పీడ్ పోస్ట్ తదితర సేవలతోపాటు బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. బ్యాంకింగ్ లైసెన్స్ అందుకోక ముందే చిన్న మొత్తాల పొదుపు పథకాలను నిర్వహిస్తున్నది. వాటిల్లో పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం (పీఎం-ఎంఐఎస్), పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్ఈ) వంటి పథకాలు ప్రజలందరికీ తెలిసినవే. పలువురు పోస్టాఫీసుల్లో పలు సేవింగ్స్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ పథకాలన్నింటికీ నామినీ ఫెసిలిటీ కూడా ఉంది. ఒక్కోసారి డిపాజిటర్లు అవాంఛనీయ కారణాల వల్ల మరణిస్తే.. వారి డిపాజిట్లపై క్లయిమ్ దాఖలు చేయడం ఎలా.. అందుకు సమర్పించడానికి అవసరమైన పత్రాల గురించి తెలసుకుందాం.
డిపాజిట్ దారుడు మృతి చెందాక.. సంబంధిత పథకం కింద డిపాజిట్ చేసిన క్లెయిమ్ మొత్తం నామినీ లేదా సదరు డిపాజిటర్ చట్టబద్ధ వారసులకు అందిస్తారు. కానీ, ఆయా డిపాజిట్ పథకాలను బట్టి క్లయిమ్‌లు రూ.5 లక్షలకు పైగా ఉండొచ్చు. మృతి చెందిన డిపాజిటర్ వారసులం అని చెప్పడానికి చట్టబద్ధమైన ఆధారాలు లేని పక్షంలో సంబంధిత క్లయిమ్దారుడు తప్పనిసరిగా కోర్టు నుంచి వారసత్వ ధృవీకరణ పత్రం పొంది.. దాన్ని సంబంధిత పోస్టాఫీసు శాఖలో సమర్పించాలి. నామినీ కూడా మరణిస్తే చట్టబద్ధమైన వారసుడికి కాక మృతి చెందిన నామినీ చట్టబద్ధ వారసులకు ఆ ఖాతా క్లయిమ్ లభిస్తుంది.
ఒక్కోసారి డిపాజిటర్లు నామినీ పేర్లు నమోదు చేయకపోవచ్చు. క్లయిమ్ దారుడి వద్ద ఎలాంటి చట్టబద్ధమైన సాక్ష్యాలు ఉండకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో డిపాజిటర్ మరణించాక ఆరు నెలలకు క్లయిమ్ ఫైల్ చేయొచ్చు. అయితే, తుది క్లయిమ్ రూ.5 లక్షల్లోపే ఉండాలి. సంబంధిత వారసుడు తప్పనిసరిగా డెత్ సర్టిఫికెట్, సదరు డిపాజిట్ పథకం పాస్‌బుక్, డిపాజిట్ రశీదులు, అఫిడవిట్, డిస్క్లయిమర్ లెటర్, ఇండెంనిటీ బాండ్ వంటి పత్రాలు సంబంధిత పోస్టల్ అధికారులకు తెలియజేయాలి.
ఒకవేళ మరణించిన డిపాజిటర్ ఖాతాలో రూ.5 లక్షలకు పైగా ఉంటే క్లయిమ్ ఫామ్, డెత్ సర్టిఫికెట్, పాస్‌బుక్ లేదా డిపాజిట్ రశీదులు, కోర్టు జారీ చేసిన ‘సక్సేషన్ సర్టిఫికెట్’ కూడా ఫైల్ చేయాలి. ఇవన్నీ సమర్పించిన తర్వాత గడువులోపు క్లయిమ్ దారుడు పరిహారం పొందవచ్చు.
క్లయిమ్ కోసం కేవైసీ పత్రాల ప్రతులు సమర్పించినా ఒర్జినల్ కేవైసీ పత్రాలతో వాటిని అప్రూవ్ చేస్తారు కనుక అన్ని ఒరిజినల్ పత్రాలు జాగ్రత్తగా దాచి పెట్టుకోవాలి. కేవైసీ పత్రాలపై సాక్షులు కూడా సంతకాలు చేయాలి. తప్పనిసరిగా పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా, బ్యాంక్ సేవింగ్స్ ఖాతా వివరాలు అందజేయాలి. క్లయిమ్ మొత్తం నేరుగా సదరు దరఖాస్తు దారుడి ఖాతాలో డిపాజిట్ అవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

