Postal A/C Details with IVR |ఐవీఆర్తో పోస్ట్ ఖాతాల వివరాలు.. డిటైల్స్ ఇవీ
Postal A/C Details with IVR | ఐవీఆర్ సిస్టమ్ ద్వారా పోస్టల్ బ్యాంకులో వివిధ ఖాతాల లావాదేవీలు, వడ్డీ తదితర వివరాలు తెలుసుకోవచ్చు.

Postal A/C Details with IVR | ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతాదారులు ఇక ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) ఫెసిలిటీని ఉపయోగించి తమ ఖాతా లావాదేవీలు, బ్యాలెన్స్, డిపాజిట్ వివరాలు తెలుసుకోవచ్చు. సేవింగ్స్ ఖాతాలపై, ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చే వడ్డీ గురంచి తెలుసుకునే వీలు కలుగుతుంది. అంతే కదు ఫోన్లోనే ఏటీఎం కార్డ్ బ్లాకింగ్, న్యూ కార్డుల జారీ, వివిధ రకల పోస్టల్ సేవింగ్స్ స్కీమ్స్ గురించి తెలుసుకోవచ్చు.
తపాలాశాఖ ప్రారంభించిన ఐవీఆర్ ఫెసిలిటీ.. పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్ఈ)ల్లో ఉపయోగించుకోవచ్చు. ఖాతాదారులు ఇండియా పోస్ట్ టోల్ ఫ్రీ ఫోన్ నంబర్ 18002666868కు తమ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ద్వారా ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ ఐవీఆర్ ఫెసిలిటీలో వన్ నంబర్ నొక్కితే హిందీలో సమాచారం వస్తుంది. 5 నంబర్ నొక్కితే అన్ని రకాల ఖాతాల్లో బ్యాలెన్స్ సమాచారం తెలుస్తుంది. బ్యాలెన్స్ కోసం మీ ఖాతా నంబర్ నమోదు చేసి.. హ్యాష్ (#) క్లిక్ చేస్తే సరి.. ఇక 6 నంబర్ క్లిక్ చేస్తే ఏటీఎం కార్డు బ్లాక్ అవుతుంది. 6 నంబర్ నొక్కిన తర్వాత కార్డు నంబర్.. 2 ఖాతా నంబర్, 3 తర్వాత కస్టమర్ ఐడీ నంబర్ నమోదు చేయాలి.
ఇతర సర్వీసుల కోసం 7 నంబర్ క్లిక్ చేయాలి. ఇండియన్ పోస్ట్ బ్యాంకింగ్ సేవల కోసం 2 క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకటి నొక్కితే మీ సేవింగ్స్ ఖాతాతోపటు పీపీఎఫ్, ఎస్ఎస్ఏ వివరాలు తెలుస్తాయి. తొలుత మీ ఖాతా నంబర్ ఫీడ్ చేసి తర్వాత హ్యాష్‌ట్యాగ్ నొక్కాలి.. మీ ఖాతా స్టేటస్ తెలుసుకోవడానికి వన్ నొక్కాలి.
చివరి నాలుగు లవదేవీల కోసం రెండో నంబర్ నొక్కాలి. స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్ కోసం మూడు నొక్కాలి. 4 నొక్కితే వడ్డీ ఆదాయంపై ఎంత ఐటీ తగ్గుతుందో తెలుస్తుంది. ఖాతా వివరాలు తెలుసుకోవడం ఆపాలంటే ఐదు నొక్కితే సరి. ఏటీఎం కార్డుకు సంబంధించి మూడు నంబర్ నొక్కాలి. తర్వాత రెండు నొక్కితే కొత్త ఏటీఎం కార్డు. ఒకటి నొక్కితే ఏటీఎం కార్డు పిన్ నంబర్ మార్చుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

