న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30 : స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్షే ఇండియా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ మాడల్‌ను పరిచయం చేసింది. కయన్నే ఎలక్ట్రిక్ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ప్రారంభ ధర రూ.1.77 కోట్లుగాను, కయన్నే టర్బో ఎలక్ట్రిక్ మాడల్ ధర రూ.2.28 కోట్లుగా నిర్ణయించింది. ఈ మాడల్‌ను బుకింగ్ చేసుకున్న కస్టమర్లు డెలివరీ ప్రారంభించింది కూడా. 113 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన మాడల్ 642 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనున్నది.
కేవలం 2.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ మాడల్ గంటకు 260 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 14.25 ఇంచు ఓఎల్ఈడీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్‌తో తయారు చేసింది.