హైదరాబాద్, డిసెంబర్ 2: దేశంలో అతిపెద్ద హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటైన పీఎన్బీ హౌజింగ్ ఫైనాన్స్ హైదరాబాద్లో మరో శాఖను ప్రారంభించింది. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన శాఖలో ఖాతాదారులకు ఆర్థిక సేవలు, గృహ రుణాల మంజూరుతోపాటు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా స్వీకరించనున్నట్టు బ్యాంక్ చీఫ్ సేల్స్ అధికారి దిలీప్ వైతేశ్వరన్ తెలిపారు.