హైదరాబాద్‌లో తొలి షోరూం ప్రారంభించిన పెప్పర్ఫ్రై
ఫర్నిచర్, హోం ప్రొడక్ట్స్‌కు పెట్టింది పేరు పెప్పర్ ఫ్రై. తన సేవల విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లోని మియాపూర్‌లో తొలి స్మాల్ ఫార్మాట్...

హైదరాబాద్: ఫర్నిచర్, హోం ప్రొడక్ట్స్‌కు పెట్టింది పేరు పెప్పర్ ఫ్రై. తన సేవల విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లోని మియాపూర్‌లో తొలి స్మాల్ ఫార్మాట్ స్టూడియోను ప్రారంభించింది. 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో హోం పెడ్లర్స్ భాగస్వామ్యంతో ప్రారంభించిన ఈ స్టూడియో దేశంలోనే 75వది.. హైదరాబాద్‌లో మూడో స్టూడియో.. వచ్చే ఏడాది లోకగా 200కి పైగా స్టూడియోలను స్థాపించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది పెప్పర్ ఫ్రై.
ఫర్నీచర్ అండ్ డెకరేషన్ రంగంలో కస్టమర్లకు అద్భుతమైన సేవలందిస్తున్నది. ఇప్పటికే పెప్పర్ ఫ్రై వెబ్సైట్లో లక్షకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల కలల సాకారానికి అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులను అందజేస్తున్నది. బంజారాహిల్స్‌లో 1880 చదరపు అడుగులు, గచ్చిబౌలిలో 3800 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెప్పర్ఫ్రై అతిపెద్ద ఫార్మాట్ స్టూడియోలను నిర్వహిస్తున్నది.
పెప్పర్ ఫ్రై బిజినెస్ హెడ్ అమ్రుత గుప్తా స్పందిస్తూ పలు ప్రాంతాల కస్టమర్లకు అందుబాటులో ఉండే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. వివేకం గల కస్టమర్లకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఇండ్ల నిర్మాణంలో సహాయకారిగా ఉంటామని అన్నారు.
హోం పెడ్లర్స్ అధినేత శ్రీనివాస్ ప్రగల్లపాటి మాట్లాడుతూ హోం అండ్ ఫర్నిచర్ రంగంలో కస్టమర్లకు మార్గదర్శకత్వం వహించే సంస్థ పెప్పర్ ఫ్రై అని పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

