Vida Powered By Hero | ఎలక్ట్రిక్ బైక్స్‌పై హీరో ఫ్యామిలీలో ఇలా పరిష్కారం.. ఇదీ ముంజాల్ స్టైల్
Vida Powered By Hero | విద్యుత్ బైక్స్‌కు హీరో మోటో కార్ప్స్ చైర్మన్ పవన్ ముంజాల్ పరిష్కారం చూపారు. విదా బ్రాండ్‌తో ఆ బైక్స్ రానున్నాయి.
Vida Powered By Hero | ప్రముఖ టూ వీలర్స్ కంపెనీ హీరో కుటుంబం.. విద్యుత్ వాహనాలకు హీరో బ్రాండ్ వాడకంపై క్లారిటీ తీసుకొచ్చింది. పవన్ ముంజాల్ సారధ్యంలోని హీరో మోటోకార్ప్ గ్రూప్‌లో ఉన్న వివాదాలకు దాదాపు తెర పడింది. పవన్ ముంజాల్ తాను త్వరలో తీసుకొచ్చే ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లకు హీరో అనుబంధ విదా బ్రాండ్ పేరిట విపణిలోకి తీసుకురానున్నట్లు తెలిపింది. న్యాయ వివాదాల నుంచి బయటపడేందుకు పవర్డ్ బై హీరో అనే ట్యాగ్‌లైన్‌తో విదా బ్రాండ్ ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను తేస్తామని ప్రకటించింది.
విద్యుత్ స్కూటర్లు, బైక్‌లకు హీరో బ్రాండ్ వాడకంపై హీరో మోటో కార్ప్స్ చైర్మన్ పవన్ ముంజాల్, ఆయన సోదరుడి కొడుకు నవీన్ ముంజాల్ కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. ముంజాల్ ఫ్యామిలీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాలకు హీరో బ్రాండ్.. నవీన్ ముంజాల్ కుటుంబానికి చెందుతుంది.
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోవడంతోపాటు భూతాపం నివారణకు ప్రభుత్వం విద్యుత్ వాహనాల వాడకం ప్రోత్సహిస్తున్నది. ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లకు కూడా గిరాకీ పెరిగింది. పెట్రోల్ ఆధారిత టూ వీలర్స్ మార్కెట్‌పై హీరో గ్రూప్‌దే ఆధిపత్యం. హీరో బ్రాండ్‌తో విద్యుత్ వాహనాలు తేవాలని పవన్ ముంజాల్ చర్యలు తీసుకున్నారు. కానీ నవీన్ ముంజాల్ న్యాయ పోరాటానికి దిగారు. న్యాయస్థానాలు కూడా మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

