న్యూఢిల్లీ, జనవరి 21: ప్రపంచానికి గుబులు పుట్టించిన బ్లాక్ ఫంగస్‌కు పతంజలి ‘అను తైల’ పేరుతో నాసల్ డ్రాప్స్‌ను తీసుకొచ్చింది. పతంజలి రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల బృందం ఈ ముక్కులో వేసుకునే డ్రాప్స్‌ను ఆవిష్కరించింది. బ్లాక్ ఫంగస్‌పై అను తైల నాసల్ డ్రాప్స్ ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని సైంటిస్టులు తెలిపారు. తమ పరిశోధనల్లో అను తైలతో ఇన్ఫెక్షన్ తీవ్రత తగ్గుముఖం పట్టినట్టు గుర్తించామన్నారు. ఇతర ఔషధాలతో పోల్చితే అను తైల వాడకం బ్లాక్ ఫంగస్ రోగులకు త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తున్నదని చెప్పారు.