పతంజలి ఫుడ్స్ చేతికి పీఏఎల్ పర్సనల్ కేర్
యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ (పీఏఎల్)కు చెందిన హోం, పర్సనల్ కేర్ వ్యాపారాన్ని తమ సొంతం చేసుకున్నట్టు పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సోమవారం ప్రకటించింది.
- డీల్ విలువ రూ.1,100 కోట్లు
న్యూఢిల్లీ, జూలై 1: యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ (పీఏఎల్)కు చెందిన హోం, పర్సనల్ కేర్ వ్యాపారాన్ని తమ సొంతం చేసుకున్నట్టు పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సోమవారం ప్రకటించింది. ఈ అంతర్గత లావాదేవీ విలువ రూ.1,100 కోట్లుగా పేర్కొన్నది. ఐదు విడుతల్లో ఈ చెల్లింపులు జరుగుతాయి. కంపెనీ వాటాదారులు, రుణదాతల ఆమోదానికి లోబడి ఈ లావాదేవీ ఉంటుంది. అలాగే దీనికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం రావాల్సి ఉన్నది.
ప్రధాన ఎఫ్ఎంసీజీ కంపెనీగా ఎదగడానికే ఈ డీల్‌కు దిగినట్టు దేశీయ వంటనూనెల తయారీ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా ఉన్న పతంజలి ఫుడ్స్ సంస్థ తెలిపింది. కాగా, ప్రస్తుతం పతంజలి ఫుడ్స్ ప్రమోటర్లలో పీఏఎల్ కూడా ఒకటిగా ఉన్నది. ఇక ఈ డీల్‌తో హెయిర్ కేర్, స్కిన్ కేర్, డెంటల్ కేర్, హోం కేర్ వ్యాపార విభాగాలు పతంజలి ఫుడ్స్ కిందకు వస్తాయి. ఈ డీల్ ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరుకల్లా పూర్తవగలదన్న ఆశాభావాన్ని పతంజలి ఫుడ్స్ సీఈవో సంజీవ్ ఆస్తానా వ్యక్తం చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

