నోరూరించే పరోటాలు.. 18 శాతం జీఎస్టీ సబబే.. తేల్చేసిన గుజరాత్ అధారిటీ
GST on Paratha | చపాతీలతో పోలిస్తే పరోటాలపై 18 శాతం జీఎస్టీ విధించడం సబబేనని గుజరాత్ అప్పీలేట్ అథారిటీ తేల్చి చెప్పేసింది.
GST on Paratha | పరోటా.. దీని పేరు చెబితేనే నోరూరుతూ ఉంటుంది. మలబార్/ మిక్స్డ్ వెజిటబుల్/ప్లెయిన్ పరోటా అంటే ఆవురావురంటూ తినేస్తారు.. కానీ ఒక్క క్షణం ఆగండి.. అన్ని రకాల ఆహార ధాన్యాలు, తినుబండారాలు, స్వీట్స్, టిఫిన్స్పైనా జీఎస్టీ విధిస్తోంది కేంద్రం.. ఆ జాబితాలోకి పరోటా కూడా వచ్చి చేరిందోచ్.. ఇక ప్యాకేజ్డ్ పరోటాపైన 18 శాతం, చపాతీపైన ఐదు శాతం జీఎస్టీ విధించడం సబబేనని గుజరాత్ అప్పీలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (జీఏఏఏఆర్) ఆదేశాలు జారీ చేసింది. వాడిలాల్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన పిటిషన్ను జీఏఏఏఆర్ తోసిపుచ్చింది.
ఎనిమిది రకాల పరోటా మోడల్స్తోపాటు అదే గోధుమ పిండితో తయారుచేసే చపాతీకి ఐదు శాతం జీఎస్టీ విధిస్తున్నారని వాడిలాల్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. చపాతీతోపాటు పరోటాకు కూడా ఐదు శాతం జీఎస్టీ మాత్రమే వసూలు చేయాలని అప్పీల్ చేసింది. కూరగాయలు, ఉల్లిగడ్డ, మెంతి తదితర ఆకుకూరలు, మసాలా దినుసులను కేవలం టేస్ట్, ఫ్లేవర్ కోసమేనని, అన్ని రకాల పరోటాలు ఒక్కటేనని వాదించింది.
వాడీలాల్ ఇండస్ట్రీస్ వాదనను గుజరాత్ అప్పీలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ తోసిపుచ్చింది. చపాతీ, పరోటాలను గోధుమ పిండితో తయారుచేసినా.. చపాతీ లేదా రోటీ మాదిరిగా మూడు నాలుగు నిమిషాల్లో రెడీ కాదని పేర్కొంది. అందువల్లే పరోటాలపై 18 శాతం జీఎస్టీ విధించడం సబబేనని స్పష్టం చేసింది. చపాతీ లేదా రోటీ వేడి చేసి తినేయొచ్చునని, ప్రత్యేకంగా ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదన్నది. పిజ్జా బ్రెడ్ కూడా హీట్ అండ్ కుకింగ్ చేసి తినేయవచ్చునని, కనుక దానిపై 5 శాతం జీఎస్టీ సబబేనని పేర్కొంది.
వాడీలాల్ ఇండస్ట్రీస్ అందచేసిన పరోటాలపై వనస్పతి ఆయిల్, బ్రెడ్ ఇంప్రూవర్, పచ్చి బఠానీలు, కాలిఫ్లవర్, ధనియాల పొడి, యాలకులు, లవంగాలతోపాటు దానిమ్మ గింజలు, క్యారెట్ తదితరాలు వాడాల్సి ఉంటుందని జీఏఏఏఆర్ గుర్తు చేసింది. చపాతీ లేదా రోటీ నేరుగా వేడి చేసి తినేయొచ్చునని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- Chapathi
- gst
- paratha
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

