న్యూఢిల్లీ : ఈనెల 23న రానున్న ఒప్పో కే10 స్పెసిఫికేషన్స్ లీకయ్యాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో 6.5 ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్‌తో ఈ ఫోన్ రూ 20,000 లోపు ధరతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఈ స్మార్టఫోన్ 6జీబీ ర్యాం, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది.
మైక్రోఎస్డీ కార్డు సపోర్ట్‌ను ఆఫర్ చేస్తుంది. వెనుకవైపున ఒప్పో కే10 ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. ఒప్పో కే10 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగిఉంటుందని కంపెనీ వెల్లడించింది. బ్లాక్, బ్లూ రెండు కలర్ ఆప్షన్స్‌లో ఒప్పో కే10 అందుబాటులో ఉంటుంది. రెనో 7 ప్రో వంటి ఖరీదైన ఒప్పో ఫోన్స్ తరహాలో ఈ స్మార్ట్‌ఫోన్ గ్లో డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది.