Oppo Find X6 | త్వరలో ఒప్పో ఫైండ్ ఎక్స్6 సిరీస్.. మూడు కలర్స్‌లో లభ్యం?!
Oppo Find X6 | చైనా స్మార్ట్ ఫోన్ జెయింట్ ఒప్పో.. త్వరలో ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్ ఫోన్లు విడుదల చేయనున్నది. ఒప్పో ఫైండ్ ఎక్స్6, ఒప్పో ఫైండ్ ఎక్స్6 ప్రో వేరియంట్ల పేరిట రానున్నది.
Oppo Find X6 | చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో త్వరలో మార్కెట్లోకి ఒప్పో ఫైండ్ ఎక్స్6 సిరీస్ ఫోన్ ఎంటర్ కానున్నది. ఫైండ్ ఎక్స్6, ఫైండ్ ఎక్స్6 ప్రో మోడల్స్ పేరుతో చైనా మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఒప్పో ఫైండ్ ఎక్స్5 మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ఎస్వోసీ వస్తున్నది. మరో మోడల్ ఫైండ్ ఎక్స్6 ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
ఒప్పో ఫైండ్ ఎక్స్6 ఫోన్ 50-మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 989 మెయిన్ సెన్సర్, 50-మెగా పిక్సెల్ టెలిఫొటో, 32-మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా సెటప్‌తో వస్తున్నది. ఫైండ్ ఎక్స్6 ప్రో ఫోన్ 6.8-అంగుళాల ఈ6 అమోల్డ్ డిస్ప్లే విత్ 2కే రిజొల్యూషన్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్స్‌తో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. 2500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన డిస్ప్లే ఉంటుందని తెలుస్తున్నది.
ఒప్పొ ఫైండ్ ఎక్స్ 6 మూడు కలర్ ఆప్షన్స్ – ఫైక్యూయాన్ గ్రీన్, స్టార్రీ స్కై బ్లాక్, స్నో మౌంటెన్ గోల్డ్ రంగుల్లో లభ్యం కానున్నది. లెదర్ వేరియంట్లో డిసర్ట్ సిల్వన్ మూన్ విత్ ఫైక్యూయాన్ గ్రీన్, క్లౌడ్ ఇంక్ బ్లాక్ కలర్స్ ఆప్షన్స్‌లో రావచ్చునని తెలుస్తున్నది. అధికారికంగా ఒప్పో ఫైండ్ ఎక్స్6 ఫోన్ ఆవిష్కరణ తేదీ వెల్లడించలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

