Oppo Find N3 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘ఒప్పో (Oppo)’ మరో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘ఒప్పో ఫైండ్ ఎన్3 (Oppo Find N3)’ ఫోన్ ఆవిష్కరించింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ తో వస్తున్న ఈ ఫోన్ ఫ్లెక్సికాన్ హింజ్‌తో తయారుచేసినట్లు ఒప్పో వెల్లడించింది.
అయితే ఒప్పో ఫైండ్ ఎన్3 ఫోన్ కేవలం 16 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా మాత్రమే లభిస్తుంది. సింగపూర్ మార్కెట్లో 2399 సింగపూర్ డాలర్లు (సుమారు రూ.1,45,300) గా నిర్ణయించిన ఈ ఫోన్ ధర భారత్‌లో ఇంకా ఖరారు కాలేదు. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ కలర్ఓఎస్ 13 వర్షన్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది.
7.72-అంగుళాల 2కే (2268×2440 పిక్సెల్స్) ఎల్టీపీవో 3.0 అమోలెడ్ డిస్ ప్లేతో వస్తున్న ఈ ఫోన్ 6.31-అంగుళాల 2కే అమోలెడ్ కవర్ స్క్రీన్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ షాంనేన్ గోల్డ్, గ్రీన్ నలుగు రంగుల్లో లభిస్తుంది. 67వాట్ల సూపర్ వూక్ 2.0 చార్జింగ్ మద్దతుతో 4805 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.
48-మెగా పిక్సెల్ ప్రధాన కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో చాటింగ్ కోసం ఇన్నర్ డిస్ ప్లేలో 20-మెగా పిక్సెల్, ఔటర్ స్క్రీన్‌లో 32-మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై-7, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుందీ ఈ ఫోన్.